కార్తీక దీపం సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు లిస్ట్ చెప్పడం కూడా కష్టమే. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా తొలిసారి టీవీలో ప్లే అయినా..తెలుగించి ప్రజలు కార్తీక దీపం సీరియల్ కే జై కొడతారు. అంతెందుకు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగినా కూడా కార్తీక దీపం సీరియల్ డామినేట్ చేస్తోంది. రేటింగుల పరంగా కార్తీక దీపం ఎవరికీ అందనంత రేంజులో దూసుకుపోతోంది. తాజాగా విడుదల చేసిన 42వ వారం రేటింగ్స్ లో సైతం కార్తీక దీపం టాప్ ప్లేసులో నిలిచింది. కార్తీక దీపం తర్వాతి స్థానాల్లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాటు, వదినమ్మ, కోయిలమ్మ, మౌనరాగం సీరియల్స్ రేటింగ్ పరంగా టాప్ ప్లేస్ సంపాదించుకున్నాయి. ఇక కావాల్సినంత పబ్లిసిటీతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సైతం కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ ముందు నిలబడలేకపోయింది. స్టార్ హీరో నాగార్జున వ్యాఖ్యాత చేస్తోన్న బిగ్ బాస్ షో వచ్చిన హైప్ మాములుగా లేదు. అయినా కూడా కార్తీక దీపం ముందు నిలబడలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు టాప్ 5 ప్రోగ్రామ్స్ లో అసలు బిగ్ బాస్ లేకపోవడం గమనార్హం
ఆడియన్స్ బిగ్ బాస్ కన్నా ఎప్పట్నుంచో ఫాలో అవుతోన్న సీరియల్స్ కే జై కొడుతున్నారన్నది నిపుణుల మాట. నిజానికి కార్తీకదీపం ఫిక్స్ చేసిన టీఆర్పీ రేటింగులు మరో సీరియల్ అందుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. తాజా రేటింగ్ తో వంటలక్క, డాక్టర్ బాబు అభిమానుల ఫుల్ జోష్ లో ఉన్నారు. స్టార్ హీరో నాగార్జున షోను సైతం కాదని తమ వంటలక్క నటించిన కార్తీక దీపం సీరియల్ నే జనం ఎక్కువగా ఆదరించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వంటలక్క తోపు, దమ్ముంటే ఆపు అనే మీమ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక బిగ్ బాస్ తెలుగు షో ఎండింగ్ కు రావడంతో ఉత్కంఠ పెరిగింది. ఇంకా మూడు వారాల సమయమే ఉంది.. ఏడుగురు టాప్ 7 కంటెస్టెంట్లు పందెం కోళ్లలా హౌస్ లో ఢీ అంటే ఢీ అంటున్నారు. మోనాల్, అవినాష్ లో ఎవరు వెళ్లిపోతున్నారో బిగ్ బాస్ కే తెలియాలి. అభిజిత్, సొహైల్, అరియానా, అఖిల్, హారికలు టైటిల్ బరిలో కనిపిస్తున్నారు. ఇక రేస్ టు ఫినాలే మెడల్ వార్ హౌస్‌లో కాకరేపుతోంది. ఫస్ట్ లెవల్‌లో గెలిచి సెకండ్ లెవల్‌కి అర్హత సాధించారు అభిజిత్, అఖిల్, సొహైల్, హారికలు.. మరి ఈ నలుగురులో ఎవరు గెలిచి మెడల్ సాధించి నేరుగా ఫైనల్‌కి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అది బిగ్ బాస్ హౌస్..ఏమైనా జరగొచ్చు..లెట్స్ వెయిట్ అండ్ సీ.