బిగ్ బాస్ 4: కుమార్ సాయిపై ప‌గ‌బ‌ట్టిన బిగ్ బాస్..ఏకిపారేస్తున్న సోదరుడి ఫ్యాన్స్

బిగ్ బాస్..కుమార్ సాయిపై పగ బట్టాడా..? లేక అతడు నాగార్జునపై అనుకోకుండా వేసిన ‘ఇంగ్లీషు ఒక్కటే వచ్చు’ పంచ్ అతడికి వ్యతిరేకంగా మారిందో తెలియడం లేదు ప్రజంట్ పరిస్థితి చూస్తుంటే. ప్రస్తుత సీజన్‌లో పబ్లిక్‌కు మోస్ట్ ఫేవరెట్‌గా మారాడు కుమార్ సాయి. కానీ అతడ్ని ఎక్కువరోజులు ఇంట్లో ఉండనివ్వలేదు. కేవలం టాస్కులు మాత్రమే ఆడిన కుమార్ సాయి..ట్రాక్‌లు నడపలేదు, పులిహోర కలపలేదు. దీంతో బయటకు సాగనంపారు. బయట వివిధ వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్ పెట్టిన ఓటింగ్లో అతడికి ఎక్కువశాతం మంది ఓట్లు వేసినప్పటికీ…ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. దీంతో వ్యాఖ్యత నాగార్జునపై, బిగ్ బాస్ నిర్వాహకులపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

కుమార్ సాయి రీ ఎంట్రీ :

ఈ క్రమంలో కుమార్ సాయి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ ప్రారభించారు అతడి అభిమానులు . అతడు బిగ్ బాస్ ఇంట్లోకి పునరాగమనం చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ వాటిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు కుమార్ సాయి. తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, ఒకవేళ అవకాశం వస్తే మళ్లీ ఇంట్లోకి వెళతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా రీ ఎంట్రీకి సంబంధించి హాట్‌స్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో కుమార్ సాయి ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ చేసిన ట్వీట్‌లో రీఎంట్రీ గురించి ఓ పోల్ నిర్వహించింది. ‘ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఎవరు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు’ అని ఆ పోల్‌లో అడిగారు. అందులో ఆప్షన్లుగా దివి, అమ్మ రాజశేఖర్, నోయల్, మెహబూబ్ పేర్లను ఆప్షన్లుగా పెట్టారు. కాగా ఈ పోల్‌లో నోయల్‌కు యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఇక్కడే కుమార్ సాయి ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. బయట ఇంతమంది అతడిని ఇంట్లోకి పంపాలని కోరుతుంటే..కనీసం మీ పరిశీలనలో కూడా కుమార్ సాయి పేరు లేకపోవడం ఆశ్యర్యాన్ని కలిగించింది అంటూ కొందరు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. అతడి పేరు పెడితే ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో తెలుస్తుందని, ఇప్పుడు కూడా సదరు ట్వీట్ కింద కామెంట్లు చదివితే విషయం బోధపడుతుందని సూచిస్తున్నారు. కావాలనే కుమార్ సాయిని టార్గెట్ చేసి బయటకు పంపారని ఇప్పుడు నిర్దారణ అయ్యిందని చెబుతున్నారు. ఏది ఏమైనా కుమార్ సాయి ఎలిమినేషన్ వ్యవహారం బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ఓ మచ్చలా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.