మూడు క్రేజీ ఆఫర్స్ తో బిజీగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి

బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లోకి సైలెంట్ గా అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో.. తన మాట తీరుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది దివి. బిగ్ బాస్ నుండి 50 రోజులకే ఎలిమినేట్ అయినా.. వరుస ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. గ్రాండ్ ఫినాలే రోజు తన సినిమాలో దివికి ఒక పాత్ర కన్ఫామ్ అంటూ చిరంజీవి మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ లో అవకాశం వచ్చిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దివిని సెలెక్ట్ చేసినట్లుగా తెలిసింది. దీంతో పాటు ఇఫ్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో దివి ఓకే అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దివి ప్రస్తుతం అద్దిరిపోయే 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది.


ప్రస్తుతం దివి ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కోసం గోవాలో షూటింగ్ లో బిజీగా ఉంది. ఇటీవల కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న కొత్త సినిమా షూటింగ్ కోసం స్టార్ట్ అవ్వబోతున్నట్లు తెలిసింది. అలాగే అతి త్వరలోనే దివి ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం సినిమా టీమ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ 3 సినిమాలతో పాటు మిగిలిని ప్రాజెక్ట్స్ విషయంలో కూడా దివి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో ఎప్పటికప్పుడు అప్టేట్ చేస్తుంది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి తన సోషల్ మీడియా అకౌంట్ లో తన అభిమానుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే లేటెస్ట్ ఫోటోషూట్స్ తో.. అద్దిరిపోయే క్రేజీ లుక్స్ లో అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. దివి కి కాలం కలిసిరావడమంటే ఇదేనేమో అన్నట్లుగా మారింది. బిగ్ బాస్ కి ముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఆమెకు పేరు రాలేదు. కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం తన దశ తిరిగినట్లే అంటున్నారు ప్రేక్షకులు.