Home TV SHOWS అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. సాఫ్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్ లో అభిజీత్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించినప్పటికి హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత్ అందరూ ఈ కుర్రాడిని మర్చిపోయారు.

Life Is Beautiful (2012) - Imdb

అయితే ఇటీవల బిగ్ బాస్ సీజన్ -4 తో పాపులారిటీని సంపాదించుకొని విన్నర్ గా నిలిచాడు. దాంతో అభిజీత్ కి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ ఎంతగా పెరిగిందంటే టీమిండియా క్రికెటర్ గిఫ్ట్ పంపడం తో సెన్షేషనల్ న్యూస్ అయ్యేంతగా. బిగ్ బాస్ హౌస్లోకి చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. అందరిలో ఒకడిగా సింపుల్ కంటిస్టెంట్ గా కొనసాగాడు. షో ప్రారంభంలో మోనాల్ గజ్జర్ తో బాగా క్లోజ్ అయ్యాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ లో ఉన్నారన్న ప్రచారం జరిగింది.

Bigg Boss Telugu 4 Winner: Actor Abhijeet Duddala Wins The Trophy - Times  Of India

అభిజీత్ టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడుతూ తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే హౌస్లో బలమైన కంటెస్టెంట్ గా మారిపోయాడు. ఫలితంగా బిగ్ బాస్ టైటిల్ అందుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత అభిజీత్ కు సినిమా ఛాన్స్ లు బాగానే వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
కాగా తాజాగా టీమిండియా క్రికెటర్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు అభిజీత్. ఆటోగ్రాఫ్తో కూడిన రోహిత్ శర్మ జెర్సీని అభిజీత్ కి పంపించాడు మరో క్రికెటర్ హనుమ విహారి.

Rohit Sharma'S Gift To Abhijeet .. Surprise From Australia!

ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు అభిజీత్. ‘ఆస్ట్రేలియా నుంచి రోహిత్ శర్మ హలో చెబుతున్నాడు. వండర్ఫుల్ గిప్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ విహారి. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. లాస్ట్ టెస్టులో నీ ఆట అద్భుతం’ రిప్లై ఇచ్చాడు. ఇక రోహిత్ గురించి.. ‘ఏమని చెప్పను? రోహిత్ ఆట చూడటానికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసేవాడిని. నీది బ్యాటింగ్ మాత్రమే కాదు.. అదో అద్భుతమైన టాలెంట్. థాంక్యూ రోహిత్.. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్. నిజానికి చిన్నప్పుడు నాకు క్రికెటర్ అవ్వాలని ఉండేది. కానీ కుదరలేదంటూ అభిజీత్ తెలిపాడు.

- Advertisement -

Related Posts

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

వలసదారులకి గుడ్ న్యూస్ చెప్పిన జో బైడెన్ .. ఏమిటంటే ?

అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేకానేక వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో...

Latest News