బిగ్‌బాస్ బ్యూటీకి ఆఫ‌ర్ల వెల్లువ .. ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ రావ‌డంతో ఎగిరి గంతేసిన దివి

బుల్లి తెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ లాంటి రియాలిటీ షో బిగ్ బాస్.. అప్పటివరకు ఓ లెక్క.. అక్కడ్నుంచి మరో లెక్క.. చరిత్ర తిరగరాయాల్సిందే.. ఈ డైలాగులన్నీ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ కి సరిగ్గా సరిపోతాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిని వరుస పెట్టి మరీ ఆఫర్లు వరిస్తున్నాయి. నిన్న మొన్నటివరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం బిజీ అయిపోతున్నారు. మోనాల్ ఇప్పటికే అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ మాలో ప్రసారమయ్యే డ్యాన్స్ ప్లస్ షోకు జడ్జిగా చేస్తుంది. ఇక సోహైల్ హీరోగా సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. అభిజిత్, మెహబూబ్ లు కూడా చిరంజీవి సినిమాలో అవకాశం అందుకున్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో క్రేజీ బ్యూటీగా ప్రశంసలు అందుకున్న దివిని మెగా ఫ్యామిలీ కన్నెసిందని చెప్పుకోవచ్చు. దసరా పండుగ రోజు ఎలిమినేట్ అయినప్పుడే హీరో కార్తికేయ తన సినిమాలో దివికి ఆఫర్ ఇస్తానని తెలిపారు. ఇక గ్రాండ్ ఫినాలే రోజు మెగా హీరో చిరంజీవి తన వేదాలం రీమేక్ లో దివికి ఒక క్యారెక్టర్ ఇస్తానని ప్రామిస్ చేశారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు దివికి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో ఓ పాత్రను దివి కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఫిల్మ్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలో దివికి ఛాన్స్ వస్తే కనుక.. బిగ్ బాస్ బ్యూటీకి కెరీర్ పరంగా పంట పండినట్లే అంటున్నాయి సినీ వర్గాలు.