ఏ భాషలోనూ దొరకనంత ప్రాచుర్యం బిగ్ బాస్‌కు తెలుగులో దక్కింది. తెలుగులో రేటింగ్ విషయంలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది బిగ్ బాస్. ఇప్పటివరకు మూడు సీజన్లను విజయవంతంగా నడిచాయి. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం సక్సెస్‌ఫుల్ గా నడుస్తోంది. అయితే కొన్ని అనుమానాలు కూడా వీక్షకులను వెంటాడుతున్నాయి. ఏకంగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులను మోసాలు చేస్తున్నారని కొందరు ఆధారాలు చూపిస్తున్నారు.
ఇంటర్నెట్, ఫోన్, టీవీ లాంటివి లేకుండా తమవారితో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంట్లో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు గెలవాలి. అంతేనా ప్రేక్షకుల మనసులు సైతం విన్ అవ్వాలి. అప్పుడే విజేతగా బయటకు వస్తారు. ఇందులో జరిగే అంశాలన్నీ వాస్తవమే అని నిర్వాహకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది నిర్వాహకుల సూచనల ఆధారంగానే నడుస్తుందని మరికొందరి వాదన. అన్ని సీజన్లలోనూ ఈ షో గురించి డౌట్లు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ సీజన్‌లో అవి మరింత ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు, సంఘటనలు నమ్మశక్యంగా ఉండటం లేదు. దీనికి కారణం కంటెస్టెంట్లకు పోలైన ఓట్ల లెక్కలు వీక్షకులకు తెలియజేయపోవడమే.
వీక్షకుల నుంచి ఆదరణ ఉన్న కుమార్ సాయి, దేవీ నాగవల్లి, దివి వద్యా ఊహించని రీతిలో ఎలిమినేట్ అవడమే ఇందుకు కారణం. వీళ్లు బయటకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శల తీవ్రత పెరిగింది. రేటింగ్ కోసం కొందరిని హౌస్‌లో ఉంచి, మిగతా వాళ్లను పంపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. బయటకు వచ్చినవాళ్లు చాలామంది తాము హౌస్ లో చాలా మంచి యాక్ట్స్ చేశామని, అవన్నీ చూపించకుండా..కేవలం గొడవలను మాత్రమే చూపించారని పలు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మరీ ముఖ్యంగా తమను బ్యాడ్ చేసే సన్నివేశాలను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నారని..దాని వల్ల బయట జనంలో తమ క్యారెక్టర్లు బ్యాడ్ అవుతున్నాయని చెబుతున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో గతంలో తెలుగు బిగ్ బాస్ సీజన్లలో చేసిన మహిళా కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో జరిగేవాటిని సీరియస్ కు తీసుకోవద్దని, అక్కడ కేవలం గొడవలను మాత్రమే చూపిస్తారని, వాటిని తమ నిజ జీవితాలకు ఆపాదించి చూడవద్దని ఓ లేఖ ద్వారా ప్రజలను కోరారు. సో అక్కడ జరిగేది అంతా చీటింగే అని వారు చెప్పకనే చెప్పారు.