పక్కా ప్రణాళికతో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్..కానీ అనుకున్నది జరగలేదు?

Bigg Boss 4 Telugu Surya Kiran About Contestants With Animals

బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సూర్య కిరణ్ ఆ షో లో ఎక్కువ కాలం ఉండకుండానే బయటికి వచ్చాడు. అయితే ఆ కొన్ని రోజులకే తన ఆటతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన దర్శకుడిగా మారారు. అక్కినేని సుమంత్ నటించిన మొదటి సినిమా ‘సత్యం ‘ కి దర్శకుడిగా పని చేశారు. సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత సుమంత్ హీరోగా వచ్చిన ధన 51 అనే సినిమాకు కూడా సూర్య కిరణ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత సూర్య కిరణ్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని హిట్ అందుకోలేకపోయాయి. డైరక్టర్ గా మంచి గుర్తింపు పొందిన సూర్య కిరణ్ హీరోయిన్ కల్యాణి ని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత చాలా కాలం వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని ప్లాప్ అవడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకోవల్సి వచ్చింది. దీంతో కళ్యాణి సూర్యకిరణ్ కి విడాకులు ఇచ్చింది.

అయితే సూర్యకిరణ్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో అతనికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే సూర్య కిరణ్ బిగ్ బాస్ షో కి వెళ్లడానికి మందు పక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. బిగ్ బాస్ లో ఒక మూడు వారాలు ఉండి బయటకి వచ్చిన కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభిస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నేను చేసిన సినిమా ప్రొమోషన్స్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ అవకాశం వస్తే వెళ్లి ప్రొమోషన్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా డబ్బు కుడా వస్తుంది అని పక్కా ప్లాన్ తో వెళ్ళాను అని చెప్పుకొచ్చాడు. కాకపోతే అతను అనుకున్న విషయాలు ఏమి జరగలేదు అంటూ చెప్పాడు.