బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎండింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. కాగా ఆటను మరింత రసవత్తరంగా మలిచేందుకు బిగ్ బాస్ కొత్త స్టంట్స్ వేస్తున్నాడు. నామినేషన్ ప్రక్రియలో వైవిధ్యం చూపిస్తున్నాడు. కంటెస్టెంట్లకు క్రేజీ టాస్కులు పెడుతున్నాడు. ప్రతి రోజు ఇవాళ ఎపిసోడ్ మిస్ అవ్వొద్దు అన్న రేంజ్ లో ప్రోమోలు వదులుతున్నాడు. ఇక బుధవారం జరగబోయే ఎపిసోడ్ లో పిచ్చ ఫన్ తో పాటు ఓ రేంజ్ ఫియర్ కూడా ఉంటుందని తాజా ప్రోమోను బట్టి అర్థమవుతోంది. ఏకంగా బిగ్ బాస్ ఇంటిని దయ్యాల కొంపగా మార్చేశారు తాజా ఎపిసోడ్ కోసం. గతంలో ఏ సీజన్ లో కూడా ఇలాంటి సెటప్ చూడలేదు.

ఇంట్లోకి దెయ్యాన్ని పంపించడంతో పాటు అట్మాస్పియర్ కూడా అదే రేంజులో మార్చేశారు. ఇక దయ్యాల ఆర్.ఆర్ తో ఇళ్లు దద్దరిల్లేలా చేశారు. ఇక ఇంట్లో దెయ్యాన్ని చూసి అరియానా ఓ రేంజ్ లో భయపడింది. ఇక సోహైల్, అవినాష్ దెయ్యాన్ని కామెడీగా తీసుకున్నారు. సోహైల్ అయితే ఎంత భయపెట్టినా తాను భయపడనని, కానీ నైట్ మాత్రం ఇలా రావొద్దని తన మనసులోని భయాన్ని కామెడీ వేలో వ్యక్తపరిచాడు. దీంతో బిగ్ బాస్ ఇంట్లో నవ్వులు పూశాయి. అరియానా భయంతో గజగజలాడిపోతుంటే.. హారిక మాత్రం లైట్ తీసుకోమని ఆమెకు ధైర్యం నూరిపోసింది. భయపడే వాళ్లనే వాళ్లు భయపడతారని చెప్పింది. అందుకు అరియానా తనకేం భయం లేదని కలరింగ్ ఇచ్చింది. అయితే దెయ్యం మొదటగా అరియానాకే కనిపించడంతో భయంతో బిగ్గరగా అరుస్తూ..ఏడుపు లంఖించుకుంది. దీంతో ఇంట్లో వాతావరణం మారిపోయింది.
ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో అవినాష్ కామెడీ రచ్చ రంబోలా అని అర్థమయ్యింది. దెయ్యం గురించి హారిక అవినాష్‌ను భయపెడుతూ.. ఆ అద్దంలో నుంచి రెండు పెద్ద చేతులు వచ్చి నిన్ను లోపలికి తీసుకుపోవాలి అని అనగా.. అలా చేస్తే… రెండు చేతులకు నేయిల్ పాలిష్ వేస్తానని అదిరిపోయే పంచ్ వేశాడు. అలాగే చంద్రముఖి డైలాగును తన మార్క్ స్టైల్ తో చెప్పి నవ్వులు పూయించాడు. “నేను వెంకటపతి రాజా ఈ దుర్గాష్టమికి నిన్ను అదే” అనగానే ఇంట్లో సభ్యులంతా ఓ రేంజ్లో నవ్వారు. అభి అతడి డైలాగ్ ను బాగా ఎంజాయ్ చేశాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి దెయ్యం ఎందుకు ఎంట్రీ ఇచ్చింది..వారిని ఎందుకు భయపెట్టింది…ఇంకా ఎవరితోనైనా దెయ్యం ఆడకుందా..ఈ విషయాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
House lo dayyam…Housemates lo evariki bhayam?? 👻 #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/z2W2nnhKHm
— starmaa (@StarMaa) November 25, 2020
