బిగ్ బాస్ షో ఇంగ్లీష్ లో ఉందా? డౌటే.. ఏమో.. వేరే దేశంలో ఉంది కావచ్చు. లేదంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో బిగ్ బాస్ షోను పెట్టి ఉంటారు మనకు తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిగ్ బాస్ ఇంగ్లీష్ షోను నడిపిస్తున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఎందుకంటే.. ఈసారి సీజన్ లో ఉన్న అబిజీత్, హారిక, మోనాల్.. ఈ ముగ్గురు విదేశీయులు. వాళ్లకు ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదు. అందుకే… ఈసారి తెలుగు బిగ్ బాస్ సో కాస్త ఇంగ్లీష్ బిగ్ బాస్ షోగా మారింది.
కానీ.. వీళ్లు మాట్లాడుకునే మాటలు చూసి తెలుగు జనాలకు మాత్రం తెగ చిరాకు వస్తోంది. ఇప్పటికే చాలాసార్లు నాగార్జున, బిగ్ బాస్ వీళ్లను హెచ్చరించారు. మోనాల్ అంటే తెలుగు సరిగ్గా రాదు కాబట్టి.. తను అటూ ఇటూ మిక్స్ చేసి సగం తెలుగు, సగం హిందీ, సగం గుజరాతీ, సగం ఇంగ్లీష్.. అంతా కలిపేసి మాట్లాడుతుంది. మరి.. హారిక సంగతేంటి.. అభిజీత్ సంగతేంటి. వీళ్లు ఇక మారరా? ఎన్నిసార్లు దీనిపైన బిగ్ బాస్ శిక్షించినా కూడా వీళ్లు ఎందుకు ఇంకా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారో తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.
ఈవారం నామినేషన్ల సమయంలోనూ అంతే. అభిజీత్, హారిక అయితే పూర్తిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. మోనాల్ కూడా ఈసారి పూర్తిగా ఇంగ్లీష్ లోనే వాళ్లతో మాట్లాడింది. అయితే.. అసలు వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక తెలుగు ప్రేక్షకులు మాత్రం జుట్టు పీక్కుంటున్నారు.
తెలుగు షోను కాస్త వీళ్లు ఇంగ్లీష్ షోగా మార్చేశారని నెటిజన్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ వీళ్లకు కాస్త కఠినంగా శిక్షవేయాలని లేకపోతే.. భవిష్యత్తులో ఇలాంటోళ్ల వల్ల తెలుగుకు ఉన్న ఈకాస్త ఆదరణ కూడా పోతుందని ఆందోళన చెందుతున్నారు.