AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు ఐదు సంవత్సరాల పాటు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధిగా నిలిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందేలా ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి గడప వద్దకు తీసుకువెళ్లడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి హయామంలో వాలంటీర్ల వ్యవస్థ పై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసిన జగన్ మాత్రం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎన్నికలకు ముందు వాలంటీర్లకు కూటమి నేతలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను అలాగే కొనసాగిస్తామని అలాగే వారికి గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇస్తాము అంటూ హామీలు ఇచ్చారు అయితే ఇది నిజమని నమ్మిన వాలంటీర్లు కూడా కూటమిని గెలిపించారనే చెప్పాలి.
తీరా కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే వారికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. దీంతో వాలంటీర్లు తిరిగి తమన విధులలోకి తీసుకోవాలి అంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసినప్పటికీ కూడా కూటమి నేతలు మాత్రం వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొని ఆలోచన మాత్రం చేయలేదు. దీంతో ఎలాగైనా కూటమి పార్టీలపై రివేంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో వాలంటీర్లు ఏకమయ్యారు.
ఇలాంటి సమయంలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ మాత్రం పోటీలో నిలుస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ ఎన్నికలలో మాత్రం ఇద్దరు వాలంటీర్లు నామినేషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఇది నిజంగానే వాలంటీర్ లో రివెంజ్ తీర్చుకోవడం కోసమే నామినేషన్ దాఖలు చేశారా లేకపోతే వైసిపి పథకం ప్రకారమే ఇలా చేయిస్తున్నారా అన్నది తెలియదు కానీ ఇద్దరు వాలంటీర్లు నామినేషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మమత మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వాలంటీర్లకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసింది. అందుకే చట్టసభల్లో వాలంటీర్ల వాణి వినిపించేందుకు నామినేషన్ వేసినట్లు చెప్పారు. తనను గెలిపిస్తే వాలంటీర్ల సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో శివ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇలా వాలంటీర్లు నామినేషన్ దాఖలు చేయడంతో ఇదంతా వైసీపీ ప్లాన్ అంటూ పలువురు కూటమినేతలు భావిస్తున్నారు.