బిగ్ బాస్ 6 లో మరో జబర్దస్త్ కమెడియన్.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న రియాలిటీ షోలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షో కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా ప్రసారమవుతుంది. బుల్లితెర మీద 5 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇటీవల ఓటిటిలో కూడా ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కోసం సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపికలో యాజమాన్యం బిజీగా ఉంది. మరోక వైపు బిగ్ బాస్ ఇంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో జబర్దస్త్ నుండి కూడా ఇద్దరూ కమెడియన్లు వస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షో నుండి ఆది, వర్ష బిగ్ బాస్ 6 లో పార్టిసిపేట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా మరొక జబర్దస్త్ కమెడియన్ కూడా బిగ్ బాస్ 6 లో కనిపించనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ కమెడియన్ మరెవరో కాదు ఆటో రాంప్రసాద్. సుధీర్, శ్రీను జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిన కూడా రామ్ ప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో రాంప్రసాద్ కి కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షో కోసం రామ్ ప్రసాద్ కి ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అందువల్ల రాంప్రసాద్ డేట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా అని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తొంది. ఇక బిగ్ బాస్ 6 సెప్టెంబర్ లో మొదలు కానున్నట్టు సమాచారం. ఇక సీజన్ 6 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.