Home News ఇలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నాను :బిగ్ బాస్

ఇలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నాను :బిగ్ బాస్

బుల్లితెర భారీ పాపులర్ షో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఈ వారంతో బిగ్ బాస్ కథ కంచికి చేరనుంది.102 ఎపిసోడ్‌లో ఫైనల్‌కి చేరిన కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీని చూపించారు బిగ్ బాస్. మొదటిగా ఫైనల్‌కి చేరిన ఫస్ట్ ఫైనలిస్ట్ అఖిల్ సార్ధక్ ఎమోషనల్ జర్నీని చూపించారు. అఖిల్ గురించి అద్భుతంగా మాట్లాడిన బిగ్ బాస్ అతనిలో కాన్ఫిడెన్స్ నింపారు. ఫైనల్ ఎపిసోడ్ ఇచ్చే ఎలివేషన్స్‌తో లైఫ్‌లో గుర్తిండిపోయే ఎక్స్ పీరియన్స్‌ని బిగ్ బాస్ అందించడంతో భావోద్వేగానికి గురయ్యాడు అఖిల్. ముఖ్యంగా అఖిల్ ఎమోషనల్ జర్నీ వీడియో హైలైట్ అయ్యింది. చివర్లో నీకు నచ్చిన ఫొటోని తీసుకుని లోపలికి వెళ్లమని బిగ్ బాస్ చెప్పగా.. టికెట్ టు ఫినాలే మెడల్ సాధించిన ఫొటోని హౌస్‌లోకి వెళ్లాడు అఖిల్.

Bigg Boss Says We Are Proud To Have Such A Mature Member In The House
Bigg Boss says we are proud to have such a mature member in the house

అనంతరం అభిజిత్ కూడా ఇదే విధమైన ఎక్స్ పీరియన్స్‌ని అందుకున్నాడు. యంగ్ చార్మింగ్ బాయ్‌లా వచ్చిన అభిజిత్.. ఎన్నో ప్రశంసలు అందుకుంటూ “మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్” అనే టైటిల్ కూడా సాధించారని చెప్పారు బిగ్ బాస్. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్ని మరెన్నో బంధాలను ఏర్పరచుకున్నారని చెప్పారు.కొన్ని సందర్భాల్లో మీలో మీరు కుమిలిపోయారని.. ఆ భావోద్వేగాన్ని ఎవరి ముందు చూపించలేదని దాని వలన చాలా ఎక్కువ బాధపడ్డారని.. లేనిపోని అపార్ధాలు ఉండొచ్చు.. మిగిలిన వాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా.. మీరు మాత్రం అన్నింటిని తట్టుకుని ఉన్నారు. మీరు మీకంటే ఎక్కువగా వేరే వాళ్ల గురించి ఆలోచించి.. వాళ్లకి మర్యాద ఇచ్చారు.. తిరిగి పొందుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా.. నిలకడ కోల్పోకుండా షో మొత్తం కొనసాగించారు అని చెప్పారు బిగ్ బాస్.

Bigg Boss Gave Best Compliments  To Abhijeet
bigg boss gave best compliments to abhijeet

నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నాడని చెప్పారు బిగ్ బాస్. అనంతరం అభిజిత్ జర్నీ మొత్తాన్ని వీడియో రూపంలో చూపించారు బిగ్ బాస్. అనంతరం నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే అంటూ భావోద్వేగానికి గురయ్యాడు అభిజిత్. ఇన్ని సీజన్లలో బిగ్ బాస్ నుండి ఈ విధంగా ప్రశంసలు ఎవరు పొందలేదు. ఇక అభిజీత్ అభిమానుల ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. ఈ తరువాత సొహైల్, అరియానా, హారిక ఎమోషనల్ జర్నీలను చూపించారు బిగ్ బాస్.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News