నాకు దేవుళ్లు అంటే నా పేరెంట్స్, ప్రేక్షకులు. నా వయసు ఇప్పుడు 30 ఏళ్లు. ఈ వయసులో నేను ఓ ఇల్లు, కారు తీసుకున్నా. ఇల్లు కోసం హోమ్ లోన్ తీసుకున్నా. నెలకు 45 వేల రూపాయల ఈఎంఐ కట్టాలి. ఇల్లు తీసుకున్న కొన్ని రోజులకే లాక్ డౌన్ వచ్చింది. దీంతో షూటింగులన్నీ ఆగిపోయాయి. రూపాయి సంపాదన లేదు. నెలకు 45 వేల ఈఎంఐ కట్టలేని పరిస్థితికి చేరిపోయా. మరోవైపు నాన్నకు హార్ట్ అటాక్ రావడంతో హార్ట్ సర్జరీ చేయించడానికి నాలుగైదు లక్షలు అయింది. ఆ డబ్బులు నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఇంటి ఈఎంఐలు కట్టలేకపోయాను. తెలిసిన వాళ్ల దగ్గర 10 లక్షల అప్పు తెచ్చాను. అయినా కూడా పూట గడవడం కష్టంగా మారింది. దీంతో చనిపోదామని ఫిక్స్ అయ్యాను. సూసైడ్ చేసుకుందామనుకున్నా. కానీ.. నా తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయా. ఒకవేళ నేను చనిపోతే.. వాళ్ల పరిస్థితి ఏంటి.. వాళ్లను ఎవరు చూసుకుంటారు. అని ఆలోచించా. పేరెంట్స్ ను బాధపెట్టకూడదని నిర్ణయించుకున్నా.. అంటూ తన మనసులోని బాధను బిగ్ బాస్ హౌస్ లో వెళ్లదీసుకున్నాడు ముక్కు అవినాష్.
బిగ్ బాస్ హౌస్ లోకి అవినాష్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అవినాష్ ఇంటి సభ్యులతో తన బాధను పంచుకున్నారు.
ఇంటి సభ్యులంతా ఏదో ఒక విషయాన్ని తమ మనసులో ఉన్నది ఇంటి సభ్యులతో పంచుకోవాలని బిగ్ బాస్ కోరగా.. అందరూ తమ మనసులో ఉన్నది చెప్పారు. అలాగే అవినాష్ కూడా తను సూసైడ్ చేసుకోవాలనుకున్న విషయం చెప్పాడు. తను ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డాడో కూడా చెప్పుకొచ్చాడు అవినాష్.