డబుల్ మీనింగ్ డైలాగులతో డాక్టర్ బాబుకు పంచ్ వేసిన అవినాష్…?

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్సులో ముక్కు అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అవినాష్ బిగ్ బాస్ లో పాల్గొనడం కోసం జబర్దస్త్ నుండి బయటికి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ మాటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా తన భార్యతో కలసి పలు టీవీ షోస్ లో కూడా పాల్గొంటున్నాడు. కొంతకాలంగా అవినాష్ మాటీవీలో ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాలలో శ్రీముఖితో కలిసి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజగా శ్రీముఖి అవినాష్ ఇద్దరు కలిసి మాటీవీలో ఈ వారం ప్రసారం కాబోయే ” ఈ వర్షం సాక్షిగా ” అనే కార్యక్రమంలో యాంకర్లుగా వ్యవహరించారు.

అయితే మా ఛానల్ వారు ప్రతి సీజన్ ని కూడా బాగా వాడుకుంటారు. ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో చల్లని వాతావరణంలో హీట్ పుట్టించేందుకు మా టీవీ ఈ వర్షం సాక్షిగా అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ని ప్రసారం చేయనున్నారు. ఈ షోలో బుల్లితెర నటులు నిరుపమ్, మంజుల, అంబటి అర్జున్, సుహాసిని, రవికృష్ణ, నవ్యస్వామి, నిఖిల్, కావ్య, మానస్, కీర్తి వంటి వారు జోడీలుగా సందడి చేయమన్నారు. ఇక ఈ షోలో శ్రీముఖి, అవినాష్ కూడా జంటగా యాంకరింగ్ చేయనున్నారు. అయితే ఈ షోలో అవినాష్ డబుల్ మీనింగ్ డైలాగులతో బాగా రెచ్చిపోయి సీరియల్ ఆర్టిస్ట్ ల మీద పంచ్ లు వేసాడు. ఈ క్రమంలో నిఖిల్ కావ్య ఈ షోలో ఎంట్రీ ఇచ్చాక .. అవినాష్ మాట్లాడుతూ నిఖిల్ కావ్య వచ్చారు..మీ మధ్య ఏమన్నా ఉందా అంటే తడబడ్డారు. కానీ హనీమూన్ అనగానే ఎగబడ్డారు” అంటూ అవినాష్ వారి మీద సెటైర్ వేస్తాడు.

ఆ తర్వాత ఈ షోలో కంటెస్టెంట్లకు శెనగపిండితో బజ్జీలు వేసే టాస్క్ ని ఇచ్చారు. ఈ క్రమంలో నిరుపమ్ మంజుల, అంబటి అర్జున్ సుహాసిని జంటల మధ్య పోటీ పెట్టారు. దీంతో అర్జున్ మాట్లాడుతూ ఆయన నాలుగు సంవత్సరాలు వంటలక్కతో కలిసి చేశారు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని అనగానే అవినాష్ కల్పించుకొని ఏం చేశారు అంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడాడు. అర్జున్ వెంటనే స్పందిస్తూ వంటలక్కతో పనిచేశాడు కాబట్టి వంట నేర్చుకుని ఉంటాడు అని అంటున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నిరుపమ్ మంజుల తలను నిమరుతూ ఆమె జుట్టు సరి చేస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇటువైపు అర్జున్ కూడా సుహాసిని తలను నిమురుతున్న సమయంలో ఆమె జుట్టుకు శెనగపిండి మొత్తం అంటుకుంటుంది. దీంతో వాళ్లంటే భార్యాభర్తలు ఏమైనా చేయొచ్చు కానీ మేము అలా చేస్తే వీళ్ళ ఆయన నా భార్య ఊరుకోరు అంటూ అర్జున్ అనగా అయితే నీకు ఆ ఉద్దేశం ఉందా అని మళ్లీ అవినాష్ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడతాడు. మొత్తానికి ఈ షోలో బుల్లితెర జంటలు ఈ వర్షం సాక్షిగా అంటూ వర్షంలో రొమాంటిక్ పాటలకు డాన్స్ అదరగొట్టారు.