Home News బిగ్‌బాస్ 4: దెయ్యంగా మారింది సీజన్ 1 కంటెస్టెంటా?.. సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

బిగ్‌బాస్ 4: దెయ్యంగా మారింది సీజన్ 1 కంటెస్టెంటా?.. సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ఫినాలే స‌మీపిస్తున్న కొద్ది హౌజ్‌లో ప‌రిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. బిగ్ బాస్ ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌లు ఇస్తూ కంటెస్టెంట్స్ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. ఓ ఇద్దరు స‌భ్యులు మంచిగా ఉన్నారంటే వారిద్ద‌రి మ‌ధ్య ఎలా పుల్ల పెట్టాలో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. ఇప్ప‌టికే మోనాల్‌, అఖిల్‌ని కాస్త విడ‌గొట్టిన బిగ్ బాస్ అరియానా- అవినాష్‌, అభిజీత్‌- హారిక‌పై కూడా ఫోక‌స్ చేశాడు. రానున్న రోజుల‌లో వీరి మ‌ద్య అపార్దాలు, వాగ్వాదాలు జ‌ర‌గ‌డం కామ‌న్ అనిపిస్తుంది.

Harirea | Telugu Rajyam

బిగ్ బాస్ సీజ‌న్ 4లో బుధ‌వారం ఎపిసోడ్ 81 ప్ర‌సారం అయింది. ఇందులో జ‌ల‌జ అనే అమ్మాయి దెయ్యంగా మారి హౌజ్‌లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఇంటి స‌భ్యుల‌ని భ‌య‌పెట్టించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే దెయ్యంగా మారిన ఆ అమ్మాయి ఎవ‌రు, ఆ గొంతు ఎవ‌రిది అని హౌజ్‌మేట్స్‌తో పాటు బ‌య‌టి ప్రేక్ష‌కులు కూడా ముచ్చ‌టించారు. ఇంటి స‌భ్యులు ఆర్జే సునీత అని భావిస్తుండ‌గా, నెటిజ‌న్స్ మాత్రం సీజ‌న్ 1లో హ‌రిక‌థ‌తో పాటు కామెడీతో ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్ అందించిన హ‌రితేజ అంటున్నారు. ముందు నోయ‌ల్ అనుకున్నారు, ఆ త‌ర్వాత స్వాతి దీక్షిత్ అన్నారు. కాని ఆమె హ‌రితేజ అంటూ రచ్చ చేయ‌డం మొద‌లు పెట్టారు

అయితే ఈ విష‌యం హ‌రితేజ‌కు చేర‌డంతో నేను కాదు బాబోయ్ అంటూ ఓ వీడియో వ‌దిలింది. ఆ దెయ్యం మీరే, గొంతు మీదే అంటున్నారు. అది నేను కాదు. నాకు ఎలాంటి సంబంధం లేదంటూ త‌న‌దైన శైలిలో విడుద‌ల చేసింది హ‌రితేజ‌. మ‌రి దెయ్యంగా క‌నిపించిన ఆ అమ్మాయి ఎవ‌ర‌నేది రానున్న రోజుల‌లో తెలుస్తుంద‌ని అంటున్నారు. కాగా, బిగ్ బాస్ సీజ‌న్‌4 ఈ వారం నామినేష‌న్ లో అఖిల్‌, అరియానా,అవినాష్‌, మోనాల్ ఉండ‌గా వీరిలో ఒక‌రు హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్నారు. 

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News