ఓటిటి : అప్పుడే కళ్యాణ్ రామ్ “డెవిల్” వచ్చేస్తుంది..

గత ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన చిత్రాల్లో మిడ్ రేంజ్ హీరోస్ చాలా మందే రెండు రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. కాగా ఆ హీరోస్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. కాగా తాను నటించిన రెండో సినిమాని “డెవిల్”. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

మరి పలు కాంట్రవర్సీల నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో వసూళ్లు అందుకోలేక కాస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలిపోయింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఇంకా 25 రోజులు కూడా కంప్లీట్ కాకుండా అప్పుడే ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం అయిపోయింది.

కాగా ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకోగా అందులో పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం ఈ జనవరి 14 అంటే రేపే ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం విడుదలకి వచ్చేస్తుంది అని ఫిక్స్ అయ్యింది. దీనిపై ప్రైమ్ వీడియో వారు కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ రివీల్ చేయలేదు.

కానీ సినీ వర్గాలు నుంచి మాత్రం వార్త కన్ఫర్మ్ అయ్యిపోయింది. జస్ట్ డిసెంబర్ ఎండింగ్ లోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇంత తక్కువ గ్యాప్ లోనే వచ్చేస్తుండడం షాకింగ్ అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం నిర్మాణం వహించగా “అర్జున్ రెడ్డి”, “ఆనిమల్” సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.