Home Entertainment బిగ్ బాస్4: చూడటానికి ఎంత బాగుందో.. అఖిల్-అభిజిత్ బంధం కొనసాగేనా?

బిగ్ బాస్4: చూడటానికి ఎంత బాగుందో.. అఖిల్-అభిజిత్ బంధం కొనసాగేనా?

ఎన్నెన్నో మల్టీస్టారర్ చిత్రాలను చూసి ఉంటాం. అందులో ఓ ఇద్దరు హీరోల మధ్య ఎప్పుడూ పడదు. ఒకరంటే ఒకరికి ద్వేషం ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం అలానే ఉంటుంది. ఇంటర్వెల్ వరకు పోట్లాడుతూనే ఉంటారు. చివరకు సెకండాఫ్‌లో కలిసిపోయి పోరాడుతారు. అలా వారిద్దరూ కలిసినప్పుడు స్క్రీన్‌పై వచ్చే నిండుదనం, వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాగే నిన్నటి ఎపిసోడ్‌లో అభిజిత్ అఖిల్ కలిసిపోవడం, గొడవలన్నీ మరిచిపోయి హత్తుకోవడం వంటివి చూస్తే అందరికీ అలాంటి ఓ ఫీలింగే వచ్చింది.

Bigg Boss 4 Telugu Week 11 Abhijeet Akhil Bonding
Bigg Boss 4 Telugu week 11 Abhijeet Akhil Bonding

అలా ఇళ్లంతా పాజిటివ్‌గా మారి.. అందరూ కలిసిపోవడం వెనుకు అఖిల్ తల్లి దుర్గ అన్న మాటలు, చూపించిన ప్రేమే కారణం. నిన్నటి ఎపిసోడ్‌లో ఫ్యామిలీటచ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆటను పూర్తిగాతిప్పేశాడు. అఖిల్ మదర్ రాకతో ఇళ్లు వాతావరణమే మారింది. అఖిల్ తల్లి దుర్గ.. ఇంట్లో వాళ్లందరిపై ప్రేమను చూపించింది. ముఖ్యంగా అభిజిత్, హారికపై ప్రత్యేక ప్రేమను కనబర్చింది. అఖిల్‌ను జాగ్రత్తగా చూసుకో నీ బ్రదర్ లాంటివాడు అని అభిజిత్‌తో పదే పదే చెప్పింది.

అఖిల్ తల్లి చూపించిన ప్రేమకు అభిజిత్ కరిగిపోయాడు. ఇంట్లో వాతావరణం మొత్తం కూల్ చేసేసింది. అమ్మలందరూ ఇంతే బాగుంటారు కదా అని అభిజిత్ మురిసిపోయాడు. ఇప్పటి వరకు జరిగినవన్నీ మరిచిపోదాం.. నేను ఏది కావాలనీ అనలేదు.. మనసులోంచి ఆ మాటలు రాలేదు.. ఏదైనా అని ఉంటే క్షమించు అని అఖిల్ దగ్గరకు అభిజిత్ వెళ్లాడు. దీంతో అఖిల్ కూడా అభిజిత్‌ను సారీ అడిగేశాడు. ఇద్దరూ ఒక్కటయ్యారు. హత్తుకున్నారు. అఖిల్ అభిజిత్‌ను స్నేహంగా దగ్గరకు లాక్కున్నాడు. అయితే ఈ స్నేహం ఎన్ని రోజులు ఉంటుందో డౌటే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Posts

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బ్రహ్మానందం కంటే బిజీ , రోజుకి మూడు లక్షలు పారితోషికం తీసుకుంటున్నసీనియర్ హీరో..!

బ్రహ్మానందం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. అంతేకాదు బ్రహ్మానందం డేట్స్ కూడా దర్శక నిర్మాతలకి దొరకడం ఒకప్పుడు గగనం అయ్యింది. చెప్పాలంటే...

Malvika sharma Yellow Dress Images

Malvika sharma Tamil Most popular Actress, Malvika sharma Yellow Dress Images,Kollywood  Malvika sharmaYellow Dress Images,  Malvika sharma Yellow Dress Images Shooting spot ,Malvika sharma,Malvika...

సమంత కి చుక్కలు చూపించిన అక్కినేని ఫ్యాన్స్ , ఒకే ఒక్క ఫోటో కొంప ముంచింది.

సమంత ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ కూడా షాకయి షేకయ్యే పని చేసింది. లైఫ్ లో ఫస్ట్ టైం సమంత ఇలాంటి పనిచేసి అడ్డంగా బుక్కైందనే చెప్పాలి. ఇప్పటి వరకు భర్త...

Latest News