బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం గడిచింది. ఒక ఎలిమినేషన్.. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. సూర్య కిరణ్ ఎలిమినేట్ కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కమెడియన్ కుమార్ సాయి (ఈరోజు ఫేం కమెడియన్) ఇంట్లోకి వచ్చాడు. అయితే మూడు ఆశయాలతోనే బిగ్‌బాస్‌లోకి వచ్చానని పేర్కొన్నాడు. ఆ మూడింటిలో ఏది నిజమైనా, జరిగినా విన్ అయినట్టే అని కుమార్ తెలిపాడు. ఇంతకీ ఆయన మూడు కోరికలేంటో ఓ సారి చూద్దాం.

Bigg Boss 4 Telugu Wild Card Entry Kumar Sai Came with 3 Targets
బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అవ్వడం మొదటి కోరిక అట. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గెలుపొందడమనేది ఇంత వరకు జరగనే లేదు. ఈయన మరి గెలుస్తాడో లేదో చూడాలి. ఇక తాను బయటకు వచ్చే సరికి పరిస్థితులన్నీ చక్కబడి, కరోనా వ్యాక్సిన్ వచ్చి.. ఎవరి పనులు వారు చేసుకునేలా ఉండాలనేది రెండో కోరికట. కానీ ఇది కూడా నెరవేరే అవకాశమే లేదు. ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతోందని, అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్‌గా పని చేస్తూ వచ్చాడట. డైరెక్టర్ కావాలన్నదే కల అట.

Bigg Boss 4 Telugu Wild Card Entry Kumar Sai Came with 3 Targets
అందుకోసమే కమెడియన్‌గా మానేసి కథలు, స్క్రిప్ట్‌లు రాసుకుంటూ బిజీగా ఉన్నాడట. ఈ బిగ్ బాస్ జర్నీ వల్ల నాగార్జునతో అనుబంధం ఎలాగూ ముడిపడుతుంది కాబట్టి.. ఎలాగైనా నాగ్‌కు ఓ స్క్రిప్ట్ చెప్పి ఒప్పిస్తాడట. ఇదే తన మూడో కోరిక అని తెలిపాడు. అయితే ఈ మూడో కోరిక మాత్రం కాస్త నెరవేరేలానే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ కమెడియన్ జర్నీ బిగ్‌బాస్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో.