బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లపై వచ్చిన ట్రోల్స్ గానీ మీమ్స్ గానీ మరేతర సీజనల్లో రాలేదు. రానురాను కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ టీం దిగజారిపోతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నాల్గో సీజన్‌లో ఒకరిద్దరు తప్పా అందరూ స్క్రాప్ అంటూ తిట్టిపోస్తున్నారు. వీరికి తోడు బిగ్ బాస్ ఇచ్చిన మొదటి వారం టాస్క్‌లు మరింత పేలవంగా ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే వైల్డ్ కార్డ్ అనే అస్త్రాన్ని వాడుతుంటాడు బిగ్‌బాస్.
మామూలుగా అన అమ్ముల పొదిలో మూడు అస్త్రాలను దాచి ఉంచాడట. అందులో బస్టాప్, ఈరోజుల్లో ఫేమ్ కమెడియన్ సాయి కుమార్, జబర్దస్త్ అవినాష్, స్వాతి దీక్షిత్ అనే హీరోయిన్ ఉన్నారట. అందులో భాగంగా నేడు ఓ కంటెస్టెంట్‌ను ఇంటిలోపలికి పంపించబోతోన్నారట. ఈ మేరకు లీకులు కూడా బయటకు వచ్చేశాయి. నేటి ఎపిసోడ్ అనంతరం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
మామూలుగా కంటెస్టెంట్లందరితో పాటే క్వారంటైన్‌లో ఉన్న సాయి కుమార్.. నేడు హౌస్‌లోకి ప్రవేశించే చాన్స్ ఉంది. మరి ఈయన గారి ఎంట్రీతో అయినా ఓ ఊపు వస్తుందా లేదా అన్నది చూడాలి. తెరపై కామెడీ చేసినంత మాత్రాన రియల్ లైఫ్‌లోనూ అంత సరదాగా, కామెడీని పంచుతారని ఆశించలేం. గత సీజన్‌లో ఆ ఉద్దేశంతోనే మహేష్ విట్టాను తీసుకుంటే అంతా రివర్స్ అయింది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.