Jabardasth Avinash: నీ కాపురం పాడు చేయనులేరా అంటూ అవినాష్ పై పంచ్ వేసిన నాగబాబు..?

Jabardasth Avinash: మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల ద్వారా కంటే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తునే ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు నాగబాబు. అయితే జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత.. కొద్దిరోజులు అదిరింది షోకి జడ్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆ షోలో జగన్ మీద చేసిన స్కిట్ లు ప్రకంపనలు సృష్టించడంతో దెబ్బకు ఆ షో అదిరిపోయింది. ఆ తర్వాత బుల్లితెరపై నాగబాబు కొద్దిరోజులపాటు కనిపించడం మానేసాడు.

ఆ తరువాత తన సొంత యూట్యూబ్ ఛానల్ ను యాక్టివ్ లో కనిపిస్తూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇటీవలే తాజాగా కామెడీ స్టార్స్ షోకి జడ్జిగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలో నాగబాబు శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, దీపిక పిల్లి యాంకర్ గా చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అవినాష్ తన స్కిట్ లో భాగంగా తన భార్యని స్టేజ్ పైకి తీసుకు వచ్చాడు. అవినాష్ స్కిట్ లో భాగంగా డైలాగ్ కొడుతూ.. ప్రేమ అనే పదం నిన్ను చూసాకే తెలిసింది.. నా మీద నమ్మకం లేకపోతే నాగబాబు గారిని అడగండి అని అనగా.. అప్పుడు వెంటనే నాగబాబు ఏరా అన్ని చెప్పమంటావా? అని కౌంటర్ వేస్తాడు.

 

అప్పుడు అవినాష్ నామీద నీకు ప్రేమ ఉంటే.. 10 మార్కుల బోర్డ్ ఎత్తండి కానీ నా బ్యాగ్రౌండ్ మాత్రం తీయకండి అని వేడుకుంటాడు.. ఇక వెంటనే నాగబాబు నీ కాపురం పాడు చేయనులేరా అంటూ సెటైర్ వేసాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక అవినాష్ విషయానికి వస్తే.. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఇటీవలే ఒక ఇంటివాడయ్యాడు. ఇక తన భార్యను కూడా స్టేజి పైకి తీసుకువచ్చి పరిచయం కూడా చేశాడు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవినాష్, బుల్లితెరపై ప్రసారమయ్యే పలు ఈవెంట్ లలో, షో లలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు.