Home Entertainment Bigg Boss 4 Telugu: ఎలిమినేట్ అయితే అవినాష్ ఆత్మహత చేసుకునేవాడా?.. అరియానా కామెంట్స్ వైరల్

Bigg Boss 4 Telugu: ఎలిమినేట్ అయితే అవినాష్ ఆత్మహత చేసుకునేవాడా?.. అరియానా కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షోలోకి రావడానికి అవినాష్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్, మల్లెమాల నుంచి, వారి నిర్భంధాలు, అగ్రిమెంట్లను విడిపించుకోవడానికి పది లక్షలు చెల్లించాడని వార్తలు వచ్చాయి. మళ్లీ తిరిగి షోలోకి తీసుకోనని చెప్పారట. ఇదే విషయాన్ని ఇంట్లో పదే పదే చెబుతున్నాడు. అతని ఉద్దేశ్యం ఏదైనా గానీ జబర్దస్త్, మల్లెమాల పరువు మాత్రం మొత్తం పోతోంది. అది కాసేపు పక్కన పెడదాం.

Bigg Boss 4 Telugu Week Ariyana Emotional With Avinash
Bigg Boss 4 Telugu week Ariyana Emotional With Avinash

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో చివరకు అమ్మ రాజశేఖర్, అవినాష్ మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి ఓ బాక్స్‌లోకి పంపించారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు కాబట్టి ఆ ఇద్దరూ కూడా ఇంటి సభ్యుల నుంచి వీడ్కోలు తీసుకున్నారు. అరియానా అవినాష్ మధ్య ఎంతో ఎమోషనల్ సంభాషణ జరిగింది. అవినాష్‌ను పట్టుకుని అరియానా ఏడ్చేసింది. ఆమె మాట్లాడిన మాటల ద్వారా ఓ విషయం బయటకు వచ్చింది.

ఒక వేళ అటూ ఇటూ అయితే ప్లీజ్ నా కోసం వెయిట్ చేయవా. నేను రాగానే నిన్ను కలుస్తాను. నీ ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఏమీ ఆలోచించకు. ఒక వేళ ఏమన్నా అయితే ఏ డిసీజన్ తీసుకోకు.. ప్లీజ్. మమ్మీ మీద ప్రామిస్ చేయి. నువ్వు ఏం చేసుకోవద్దు. నీ కాళ్లు పట్టుకుంటా.. ప్లీజ్. నువ్వు బతికుండు చాలు అవినాష్. ప్లీజ్ అవినాష్.. ప్లీజ్ అంటూ భోరున ఏడ్చింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్తే తన బతుకు ప్రశ్నార్థకమే అని పలు మార్లు చెప్పాడు. అంటే అలా ఎలిమినేట్ అయితే మళ్లీ సూసైడ్ చేసుకునే ఆలోచనలున్నాయని అరియానా మాటల ద్వారా స్పష్టమవుతోంది.

 

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News