బుల్లితెరపై ఎప్పుడూ నవ్వులు చిందుస్తూ ఉండే లాస్య వెనుక ఎంతటి విషాదం ఉందో బిగ్ బాస్ షో ద్వారా బయటకు వచ్చింది. యాంకరింగ్ కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి అయినా కూడా ఎక్కడా బయటకు రాలేదు. అందుకే యాంకర్ రవి లాస్య అంటూ వచ్చే వార్తలపై లాస్య ఫైర్ అవుతూ వచ్చేది. అలాంటిదేమీ లేదని చెబుతూ ఉండేది. ఎందుకంటే అప్పటికే ఆమెకు రహస్యంగా వివాహం జరిగిపోయింది.
లాస్యది ప్రేమ వివాహాం కావడంతో ఇంట్లో పెద్దవాళ్లు ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎవ్వరికీ తెలియకుండా ముందు వివాహాన్ని చేసుకున్నారట. ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారట. 2010లో పెళ్లైందని లాస్య చెప్పింది. మామూలుగా బిగ్ బాస్ షోలో ఎంట్రీలోనే ఈ విషయంచెప్పింది. తనకు రెండు సార్లు పెళ్లైందని, అది కూడా ఒక్కర్నే రెండు సార్లు చేసుకున్నారు. ఒకటి మాది మేమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే రెండో పెద్దల అంగీకారంతో మళ్లీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో లాస్య తన అబార్షన్, గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలను చెప్పింది. 2010లో పెళ్లి అయిందని చెప్పుకొచ్చింది. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలీదని చెప్పింది. 2012లో కలిసి ఉన్నామని వెల్లడించింది. ఆ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ అబార్షన్ చేయించుకున్నాను. 2014లో ఓసారి ప్రెగ్నెంట్ అయ్యాను కానీ అప్పుడు కూడా గర్భాన్ని తీసేయాల్సి వచ్చింది. అలా రెండుసార్లు నా బిడ్డలను నేనే చంపుకున్నానని బాధపడింది. మళ్లీ పిల్లలు పుట్టరేమో అని బాధపడ్డాను కానీ 2018లో మళ్లీ గర్భం దాల్చాను అని తన కొడుకు జున్ను గురించి చెప్పి అందర్నీ ఏడిపించింది.