బిగ్‌బాస్ 4 తెలుగు రెండో వారంలో రెండు ఎలిమినేషన్స్ అని నాగార్జున ఓ బాంబ్ పేల్చాడు. నిజంగానే ఒక వేళ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే ప్రేక్షకులకు అంత సులభంగా చెప్పేసేవాడు కాదు. డబుల్ ఎలిమినేషన్స్ అంటూ అందులో ఒకరు కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయిందని తెలిపాడు. ఇక ఆమె నేడు స్టేజ్ మీదకు వచ్చి నాగార్జునతో ముచ్చటిస్తుంది. కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను చెబుతుంది.
అక్కడి వరకు అందరూ ఊహించిందే. అయితే ఇక డబుల్ ఎలిమినేషన్ అంటూ ఇక్కడే జనాలను, కంటెస్టెంట్లను పిచ్చోళ్లను చేయడానికి నాగార్జున సిద్దమయ్యాడు. మూడో సీజన్లలోనూ ఇలానే చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అని ప్రకటించాడు. కంటెస్టెంట్లపై ఉన్న అభిప్రాయాలను చెప్పేశాడు. ఇక తీరా ఎపిసోడ్ మొత్తం అయ్యాక ఇది ఫేక్ ఎలిమినేషన్.. సీక్రెట్ రూంలో ఉండాలి అంటూ జనాలకు అసలు విషయం చెప్పాడు.
ఇప్పుడు కూడా ఇలాంటి ట్రిక్కే ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. కరాటే కళ్యాణి వెళ్లిపోయాక నామినేషన్‌లో ఉన్న మిగతా ఏడు మందిలో ఓ కంటెస్టెంట్‌ను సీక్రెట్ రూంలోకి పంపించబోతోన్నట్టు తెలుస్తోంది. ఆ కంటెస్టెంట్ హారిక అని లీకులు అందుతున్నాయి. అయితే మరి ఇది నిజమో కాదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాలి.