బిగ్ బాస్ 4: అభిజిత్ విన్నర్.. హింట్ ఇచ్చిన కుమార్ సాయి

బిగ్ బాస్ నాల్గో సీజన్ టైటిల్ విన్నర్ అభిజిత్ అని కుమార్ సాయి పరోక్షంగా ఎన్నో హింట్లు ఇచ్చాడు. నిన్నటి ఎపిసోడ్‌లో కుమార్ సాయి చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అసలు టాప్ 5లోకి రావాల్సిన కుమార్ సాయిని అన్యాయంగా ఎలిమినేట్ చేసేశారు. కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ టీం కావాలనే అలా చేసిందని అప్పట్లో టాక్ బయటకు వచ్చింది. అలా కుమార్ సాయి మళ్లీ తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లో ప్రత్యక్షమయ్యారు.

Bigg Boss 4 Telugu Week 15 Kumar Sai About Abhijeet
Bigg Boss 4 Telugu week 15 Kumar Sai about Abhijeet

స్వాతి దీక్షిత్‌తో కలిసి కుమార్ సాయి వస్తూనే డ్రామా చేశారు. ఆ యాక్షన్‌లోనే హారిక, అభిజిత్, అరియానాల గురించి పరోక్షంగా చెప్పేశారు. అమ్మాయంటే హారికల క్యూట్‌గా ఉండాలని స్వాతి దీక్షిత్‌ను కుమార్ సాయి ఏడిపించాడు. అబ్బాయంటే అభిజిత్‌లా క్యూట్‌గా ఉండాలని, బాధపడితే ఓదార్చాలని స్వాతి దీక్షిత్ చెప్పింది. నిన్ను జలజ దెయ్యంతో ఉంచాలని కుమార్ సాయి స్వాతిని ఏడిపించాడు. అయితే నిన్ను అరియానాతో ఉంచుతానని కుమార్ సాయిని స్వాతి భయపెట్టింది. అరియానా పులి.. దాని కంటే జలజే బెటర్ అంటూ కుమార్ సాయి కౌంటర్ వేశాడు.

ఇలా సోహెల్, అఖిల్ అందరి గురించి చెబుతూ.. అభిజిత్ ఫాలోయింగ్ గురించి చెప్పనకే చెప్పేశాడు. క్రికెట్ ఆడితే.. కెప్టెన్, ఆటగాళ్లకు పేరు వస్తుంది.. కానీ ఎక్కడైనా ఎంపైర్‌కు వస్తుందా? అని అభిజిత్‌ను ఉద్దేశించి అన్నాడు. ఎంపైర్ అంటూ సంచాలక్‌గా అభిజిత్ చేసిన పనులను చెబుతూ.. బయట బాగా ఫాలోయింగ్ ఉంది గెలిచేది అభిజిత్ అంటూ పరోక్షంగా చెప్పాడు. మరి సోషల్ మీడియా ట్రెండ్‌ను బట్టి చూస్తే అభిజిత్ విన్నర్ అని ఇట్టే తెలిసిపోతోంది. నిజానికి ఎవరు విన్ అవుతారో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles