బిగ్ బాస్ మరీ ఎక్కువగా మాట్లాడడు. కోపం వచ్చినా ప్రేమ కలిగినా ఒకేలా మాట్లాడతాడు. ఆ మాటల్లో ధ్వని ఫ్రీక్వెన్సీ ఏమీ మారదు. నిన్నటి ఎపిసోడ్‌లో టాప్ 5 కంటెస్టెంట్లకు జర్నీ వీడియోలను చూపించే ప్రోగ్రాం పెట్టాడు బిగ్ బాస్. కేవలం జర్నీ వీడియోలు ప్లే చేసి పంపించడు కదా. అలా బిగ్ బాస్ ప్రతీ ఒక్క కంటెస్టెంట్ గురించి కూలంకషంగా మాట్లాడతాడు. వారు పడ్డ కష్టసుఖాల గురించి చెబుతాడు. అలా అభిజిత్, అఖిల్ జర్నీ వీడియోలను చూపించి ఎమోషనల్ అయ్యేలా చేశాడు.
అందులో భాగంగా వారి గురించి బిగ్ బాస్ మాట్లాడాడు. అఖిల్ గురించి మాట్లాడింది కూడా బాగానే ఉంది. కానీ అభిజిత్ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు ఇంత వరకు ఏ సీజన్‌లోనూ మరే కంటెస్టెంట్‌కు చెప్పి ఉండడు. ఎంతో పరిపక్వత చెందిన మీలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ షోలో ఉండటం ఎంతో గర్వంగా ఉందని బిగ్ బాస్ ప్రశంసించాడు. ఆ మాటలకు అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.
అయ్యో థ్యాంక్యూ బిగ్ బాస్ అంటూ.. ఈ షోలోకి నేను రావడమే గర్వంగా ఉంది.. నా జీవితంలో నేను తీసుకుని అతి గొప్ప నిర్ణయం కూడా ఇదే అంటూ అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. మీరు ఎంత స్మార్ట్, అందరికీ గౌరవం ఇస్తారు.. అందరి నుంచి గౌరవం తీసుకుంటారు.. చాలా మెచ్యూర్డ్ కంటెస్టెంట్ అంటూ బిగ్ బాస్ పొగడ్తలు కురిపించాడు. మీరు ఇంట్లో ఎవ్వరితోనూ షేర్ చేసుకోలేని బాధలు,చెప్పుకోలేని కష్టాలు కూడా బిగ్ బాస్ విన్నాడు. మీ బాధలన్నీ నాకు తెలుసు అంటూ బిగ్ బాస్ అభిజిత్‌కు బాసటగా నిలిచాడు.