బిగ్ బాస్4: మోనాల్ అంటే ఎందుకంత ప్రేమ.. మరొకరిని బలిచేసిన బిగ్ బాస్

Bigg Boss 4 Telugu week 13 Avinash Eliminated indetas of Monal

బిగ్ బాస్ షోలో మోనాల్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఆమె శైలి భిన్నమే. పూర్తిగా ట్రాకుల మీదనే ఆధారపడి నెట్టుకొచ్చింది. అభిజిత్ అఖిల్‌లో మాట్లాడటం తప్ప మోనాల్ చేసిందేమీ లేదు. పాపం ఆమెకు బిగ్ బాస్ టీం కూడా అదే చెప్పి పంపించినట్టుంది. అలా మోనాల్ దాదాపు పది వారాలు కూడా అదే పని చేసింది. ట్రయాంగిల్ ట్రాకును బాగానే మెయింటైన్ చేసింది. కానీ అభిజిత్ కాస్త ముందుగా తేరుకున్నాడు.

Bigg Boss 4 Telugu week 13 Avinash Eliminated indetas of Monal

మోనాల్ ద్వంద్వ ధోరణిని కనిపెట్టాడు. ఆమెకు దూరంగా ఉండటం మొదలెట్టాడు. అఖిల్ కూడా ఈ మధ్య మోనాల్ అంటే చిరాకు పడుతున్నాడు. కానీ మళ్లీ వెంటనే ఒక్కటవుతున్నారు. అలా అఖిల్ మోనాల్ ట్రాకు ఇప్పుడు బాగానే నడుస్తోంది. మోనాల్ గత రెండు వారాల నుంచే గట్టిగా ఆడుతోంది. తన వాయిస్ వినిపిస్తోంది. అలా మోనాల్‌ను బిగ్ బాస్ ప్రతీసారి సేవ్ చేస్తూనే వస్తున్నాడు. మోనాల్ ఎలా సేవ్ అవుతోంది.. ఎందుకు సేవ్ అవుతోందన్న విషయాలు ఎవ్వరికీ తెలియడం లేదు.

పదమూడో వారంలో మోనాల్ ఎలిమినేట్ అయిందని అందరూ కన్ఫామ్ చేసేశారు. లీకులు కూడా ఓ రేంజ్‌లో వచ్చేశాయి. స్టేజ్ మీదకు మోనాల్ వచ్చేసింది మాట్లాడుతోందని కూడా చెప్పేశారు. మోనాల ఫ్యాన్ పేజిలు కూడా మాయమయ్యాయి. మోనాల్ సిస్టర్ హేమాలి కూడా సెట్ వద్దకు వచ్చిందని రాశారు. కానీ చివరకు మోనాల్ కాకుండా ఆమె కోసం అవినాష్‌ను ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది. మళ్లీ మోనాల్‌ను సేవ్ చేసే బిగ్ బాస్ తన పక్షపాతాన్ని చూపించాడు.