బిగ్ బాస్4: అభిజిత్ అంతకు మించి ఏం చేయడు.. పరువుదీసిన అవినాష్

Bigg Boss 4 Telugu week 13 AVinash about Abhijeet Blue sofa

బిగ్ బాస్ షోలో అభిజిత్ చేసే పనులేంటని ఎవ్వరిని అడిగినా చెబుతుంటారు. అభిజిత్ యాంటి ఫ్యాన్స్ అతనికి సోఫా స్టార్, బ్లూ సోఫా స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు. అమ్మ రాజశేఖర్ కూడా బయటకు వచ్చి అదే విషయాన్ని చెప్పాడు. అభిజిత్‌ సోఫాలో అలా కూర్చుని ముచ్చట్లు పెట్టడం తప్పా ఇంకేం చేయడని, అతనికి ఆ బ్లూ సోఫా అంటే చాలా ఇష్టమని అన్నాడు. అలా అభిజిత్ అక్కడ కూర్చుంటున్నాడని తామంతా అతని కంటే ముందు వెళ్లి అక్కడ ముచ్చట్లు పెట్టేవాళ్లమని చెప్పాడు.

Bigg Boss 4 Telugu week 13 AVinash about Abhijeet Blue sofa
Bigg Boss 4 Telugu week 13 AVinash about Abhijeet Blue sofa

అవినాష్ కూడా నిన్న ఎలిమినేట్ అయిన తరువాత అభిజిత్ గురించి ఇమిటేట్ చేస్తూ ఇంట్లో ఎలా ఉంటాడో చెప్పాడు. ఆ క్రమంలో అభిజిత్ ఇంట్లో చేసే పనులేంటో కూడా వివరించాడు. అభిజిత్‌కు గార్డెన్ ఏరియాలోని మర్రిచెట్టు దగ్గరున్న కుర్చీలు, బ్లూ సోఫా, కాఫీ కప్పు ప్రాపర్టీలన్నీ ఇచ్చి పంపించండని.. ఇవీ తప్పా అభిజిత్ ఇంకో వాటిని చూడడు. చేతిలో కప్పు పట్టుకుని అక్కడో ఇక్కడో కూర్చుని తనలో తాను ముచ్చట్లు పెట్టుకుంటాడని చెప్పుకొచ్చాడు.

అలా అభిజిత్ గురించి అవినాష్ చెప్పడంతో బ్లూ సోఫా స్టార్, సోఫా స్టార్ ట్యాగ్‌ మరోసారి ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు అభిజిత్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించాడు. అయితే అభిజిత్ చాలా మంచివాడని ఎంతో కూల్ అంటూ.. అవినాష్ ప్రశంసల వర్షం కురిపించాడు. వారం రోజుల పాటు ఏ పనీ చేయకుండా ఉండే బిగ్ బాంబ్‌ను అభిజిత్‌కు ఇచ్చాడు అవినాష్. ఈ ప్రకారం పద్నాలుగో వారంలో అభిజిత్ ఎలాంటి ఇంటి పనులుకూడా చేయాల్సిన అవసరం లేదు.