బిగ్ బాస్4: టాప్ 5లో ఉండాలనిపిస్తోందట.. బోల్డ్ పాప భోరున ఏడ్చేసింది!!

Bigg Boss 4 Telugu week 13 Ariyana Cried For out From Race to Finale task

బిగ్ బాస్ షోలో అరియానా తనది తాను బోల్డ్ అని స్వయంప్రకటితం చేసుకుంది. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చే సమయంలో ప్రోమోలోనూ అదే చెప్పింది. తాను బోల్డ్ బోల్డ్ అంటూ పదే పదే చెప్పుకొచ్చింది. కానీ షోలో అరియానాను చూశాక గానీ తెలియలేదు అది బోల్డ్ కాదు అతి అని. అరియానా తన అతితో బయట అతియానా అనే పేరును తెచ్చుకుంది. ప్రతీచిన్న దానికి అతి చేయడం.. ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం.. యాటిట్యూడ్ చూపించడంతో అతియానా అనే పేరును సార్థకం చేశారు.

Bigg Boss 4 Telugu week 13 Ariyana Cried For out From Race to Finale task
Bigg Boss 4 Telugu week 13 Ariyana Cried For out From Race to Finale task

అయితే అరియానాలో అతి మాత్రమే నెగెటివ్. మిగతావన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ఏదో ఒకటి చేయాలన్నా తపన.. అది తప్పైనా ఒప్పైనా సరే ఏదో ఒకటి చేసి అక్కడ తన ముద్ర వేయాలన్న ఆలోచనతో ఉంటుంది. ఇక్కడి వరకు అరియానా ఆలోచనలు బాగానే ఉంటాయి. కానీ వాటిల్లో కూడా తన అతిని జొప్పిస్తుంది. అలా అతి చేయడంతో ఆమె రియల్ ఎమోషన్స్ కూడా అతి అనుకునే ప్రమాదం వస్తుంది. టాప్ 5లో ఉండేందుకు అర్హత ఉన్న అరియానా నిన్నటి టాస్కులో ఓడిపోయాక భోరున ఏడ్చేసింది.

రేస్ టు ఫినాలే టాస్కులో లేడీ కంటెస్టెంట్లకు అన్యాయం జరిగేలా ఉంది. ఎందుకంటే పాలు పట్టుకునే విషయంలో మగవారు తోసుకోవడం, తోసేయడం, లాక్కోవడం వంటివి చేశారు. వీటిలో అరియానా, మోనాల్ నెగ్గుకురాలేకపోయారు. హారిక బాగానే కష్టపడింది. అయితే రెండో రౌండ్‌లో అరియానా అవుట్ అయింది. రేస్ టు ఫినాలే టాస్క్ నుంచి తప్పుకుంది. అలా టాప్ 5 నేరుగా వెళ్లే చాన్స్ మిస్ అవ్వడంతో అవినాష్‌ను పట్టుకుని అరియానా ఏడ్చేసింది. టాప్ 5లో ఉండాలనిపిస్తోందంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.