Home Entertainment బిగ్ బాస్4: అది చేశాను ఇది చేశాను అని చెప్పుకునే రకం కాదు.. అఖిల్‌కు మోనాల్...

బిగ్ బాస్4: అది చేశాను ఇది చేశాను అని చెప్పుకునే రకం కాదు.. అఖిల్‌కు మోనాల్ కౌంటర్

బిగ్ బాస్ షోలో పన్నెండో వారం మరింత వేడెక్కింది. నామినేషన్ ప్రక్రియలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలన్నీ ఒకెత్తు అయితే మోనాల్ అఖిల్ మధ్య జరిగిన చర్చ మరో ఎత్తు. మోనాల్ అఖిల్ నామినేషన్ ప్రక్రియ కంటే ముందే కొన్ని విషయాలు చర్చించుకున్నారు. నేను ఇకపై నీతో ఉండదల్చుకోలేదు.. మనం దూరంగా ఉందాం.. ఎవరి ఆట వారు ఆడుకుందాం.. ఇదంతా నేను భరించలేకపోతున్నాను అంటూ మోనాల్‌కు అఖిల్ ఉపదేశం ఇచ్చాడు.

Bigg Boss 4 Telugu Week 12 Nominations Monal Counter To Akhil
Bigg Boss 4 Telugu week 12 Nominations Monal Counter To Akhil

పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎర్ర రంగు ఉన్న టోపీలను ధరించడంతో అఖిల్ నామినేట్ అయ్యాడు. గ్రీన్ కలర్ రంగున్న టోపీని ధరించడంతొ మోనాల్ సేవ్ అయింది. అయితే నామినేట్ అయిన వారు ఎదుటివారిని ఒప్పించి వారితో మార్చుకోవచ్చని తెలిపాడు. దీంతో అఖిల్ మోనాల్‌తో చర్చకు దిగాడు. ఇక ఆ చర్చలో టాపిక్ ఎక్కడికో వెళ్లిపోయింది. కెప్టెన్సీ టాస్క్ గురించి చర్చలు పెట్టుకున్నారు. నాకు సపోర్ట్ చేస్తాను అని అన్నావ్ కానీ హారికకు సపోర్ట్ చేశావ్ అని మోనాల్‌తో అఖిల్ చెప్పుకొచ్చాడు.

నువ్ మాట మీద నిలబడవు.. ఉదయం ఒక మాట అంటావ్.. సాయంత్రం మరో మాట అంటావ్.. నీ దగ్గర నీకే క్లారిటీ లేదు.. అంటూ మోనాల్‌ను కించపరిచాడు. ప్రతీ సారి నీకు నేను సహాయం చేస్తూనే వచ్చాను.. నీ కోసం నా బట్టలు, షూలను త్యాగం చేశాను.. టాస్కుల్లో సాయం చేశాను అంటూ గతంలోని చేసినవన్నీ చెప్పుకొచ్చాడు. నిన్ను నాకోసం నామినేట్ అవ్వమని అడగను.. అది నాకు అవసరం లేదంటూ అఖిల్‌ మోనాల్‌పై మాటలను వదిలేశాడు. మోనాల్ కూడా తిరిగి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నేను అది చేశాను ఇది చేశాను.. మీ కోసం ఎంతో చేశాను అని చెప్పే టైప్ కాదు.. మీరే చెప్పారు కదా ఎవరి ఆట వాళ్లు ఆడుకుందామని అందుకే ఇప్పుడు ఆడుతున్నా అని మోనాల్ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. 

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News