Home Entertainment బిగ్ బాస్4: నువ్వు బిగ్ బాస్ షోకి పనికి రావు.. మోనాల్‌ను దారుణంగా అవమానించిన అవినాష్

బిగ్ బాస్4: నువ్వు బిగ్ బాస్ షోకి పనికి రావు.. మోనాల్‌ను దారుణంగా అవమానించిన అవినాష్

బిగ్ బాస్ షోలో పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ చిత్ర విచిత్రంగా జరిగింది. కొందరికి అదృష్టం వరిస్తే..ఇంకొందరికి దురదృష్టం వరించింది. ఇంకొందరికీ అగ్ని పరీక్షలాంటిది ఎదురైంది. గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీలు ధరించమని బిగ్ బాస్ చెప్పాడు. అలా అందరూ టోపీలను ధరించారు. అయితే ఆ టోపీల్లో రెడ్, గ్రీన్ టోపీలను ధరించారు. అందులో సోహెల్, మోనాల్‌కు మాత్రమే గ్రీన్ కలర్ వచ్చింది. దాంతో ఈ ఇద్దరే ఈ వారానికి సేవ్ అయినట్టు మిగతా వారు నామినేట్ అయినట్టు బిగ్ బాస్ తెలిపాడు.

Bigg Boss 4 Telugu Week 12 Monal Avinash Dispute
Bigg Boss 4 Telugu week 12 Monal Avinash Dispute

అయితే అఖిల్ అరియానా అవినాష్ అభిజిత్‌లకు రెడ్ కలర్ టోపీలు రావడంతో నామినేట్ అయ్యారు. నామినేషన్ రెండో లెవెల్‌లో భాగంగా ఎవరితోనైనా వాదించి, ఒప్పించుకుని మార్చుకునే వీలుని కల్పించాడు. దీంతో నామినేట్ అయిన వారు.. మోనాల్, సోహెల్‌తో వాదించారు. ఈ వాదనలో అవినాష్ హద్దులు దాటాడు. మోనాల్‌ను దారుణంగా అవమానించాడు. మాట మాట పెరిగి నువ్ షోకు పనికి రావు అని మోనాల్ అనేంత వరకు వెళ్లాడు.

నీ కంటే నేను బెటర్.. నేను టాస్కులు బాగా ఆడతాను.. నీ కంటే 200 పర్సెంట్ నేను స్ట్రాంగ్.. ఈ ఇంట్లో ఉండటానికి నీ కంటే అర్హత నాకు ఎక్కువ ఉంది.. ఈ షోకు నువ్ పనికి రావు అని ఇలా అవినాష్ మాటలు వదిలాడు. దీనికి మోనాల్ కూడా ఓ రేంజ్‌లో సమాధానాలు ఇచ్చింది. షోకు పనికి వస్తానో లేదో చెప్పడానికి నువ్ బిగ్ బాస్‌వి కాదు.. ప్రేక్షకుడివి కాదు.. వారు చూస్తున్నారు.. వాళ్లకు తెలుసు.. ఇన్ని రోజుల నుంచి సేవ్ అవుతూ ఇక్కడి వచ్చానంటే నాకు ఇక్కడే అర్హత ఉందని గట్టిగా రివర్స్ కౌంటర్ ఇచ్చింది. 

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News