బిగ్ బాస్ షోలో పనికి రానిదే ఓవర్ కాన్ఫిడెన్స్. అదే అవినాష్‌కు భరించలేనంత ఉంది. అవినాష్ తన అతి వల్ల అతినాష్ అయిపోయాడు. అరియానాతో చేరి అవినాష్ కూడా అతికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడని నెటిజన్లు సెటైర్లు వేస్తుంటాడు. బిగ్ బాస్ షోలో తానే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను.. తానే గొప్పా.. తనకే అభిమానులున్నారు.. తనకే ఓట్లు వేస్తున్నారనే పిచ్చి భ్రమలో బతుకుతున్నాడు. ఇన్నాళ్లకు ఆ భ్రమల్లో ఒక్కసారిగా తొలిగిపోయినట్టున్నాయి.
ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాగానే ఎన్నో ఆలోచనలో ఎన్నో ప్రణాళికలు రచించుకున్నాడు. ఈ వారం ఎలాగో సేవ్ అవుతాను.. ఈ పాస్‌ను వచ్చే వారం వాడుతాను అని ఇంటి సభ్యులందరితో చర్చించుకున్నాడు. ఈ వారం సేవ్ అవుతాను అని ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న అవినాష్‌కు పెద్ద దెబ్బ తగిలింది. చివరకు అవినాష్ అరియానా ఇద్దరే మిగలగా అసలు విషయం బోధపడింది. ఎలిమినేట్ అయ్యేది తానే.. తన కుండీలోనే రెడ్ కలర్ ఉందని ఊహించాడు. అప్పటి అవినాష్‌కు తన స్థాయి ఏంటో తెలిసివచ్చింది.
కనీసం అరియానాతోనూ పోటీ పడలేని స్థాయిలో అవినాష్ ఉండగా.. ఈ సీజన్ టైటిల్ విన్నర్ తానే అనే రేంజ్‌లో అతి చేస్తుంటాడు. ఈ ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, నవ్వించడానికే బిగ్ బాస్ పంపించాడే భ్రమల్లో ఉన్నాడు. బిగ్ బాస్ షో అంటే వ్యక్తిత్వానికి పరీక్ష అని తెలుసుకోలేకపోతున్నఅవినాష్‌కు ఇప్పుడు కనువిప్పు కలుగుతుందేమో. ఇప్పటికైనా తాను వేసుకున్న జోకర్ అనే మాస్కును తీసి అసలు అవినాష్‌ను చూసిస్తాడేమో చూడాలి.