బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం టైం పాస్ కోసమే ట్రాకు నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. మొదట్లో నిజంగానే ఏదో ఉందని అనిపించినా రాను రాను అది కేవలం షో కోసమే, కామెడీ కోసమే అని తెలిసిపోయింది. అరియానా అవినాష్ ట్రాకును నాగార్జున ముందుకు తోసే ప్రయత్నం చేసినా వర్కవుట్ అవ్వడం లేదు. అరియానా తనకు లవర్ ఉన్నాడని చెప్పడంతో అవినాష్ చేసిన ప్రయత్నం, వేసిన ట్రాకు మొత్తం వేస్ట్ అయింది.
అప్పటి నుంచి వీరి ట్రాకుపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పోయింది. నాగార్జున కూడా వీకెండ్‌లో అరియానా అవినాష్ ట్రాకుపై పడటం లేదు. కానీ ఈ ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఇంట్లో సందడి చేసుకుంటూ ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కామెడీలు చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. ముసల్దాన, ఆంటీ అంటూ అరియానాను అవినాష్ ఏడిపిస్తే అంకుల్ అంటూ అరియానా అవినాష్‌ను ఏడిపిస్తూ ఉంటుంది. తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లను అరియానా అవినాష్‌ల మధ్య ఈ చర్చ వచ్చింది.
షర్ట్‌లు వేయకు అంకుల్ ఉంటావ్ అని అరియానా అవినాష్‌కు సలహా ఇచ్చింది. దానికి అవినాష్ ఫైరట్ అవుతూ.. నువ్వే ఆంటీలా ఉంటావ్.. ముసల్దానివి అంటూ అరియానా పరువుదీశాడు. నీకు ఈ పాటికి పెళ్లై పిల్లలు ఉండాల్సింది.. నువ్ అంకుల్‌వి అంటూ అరియానా అవినాష్‌పై విరుచుకుపడింది. ముందు బొజ్జ వెసుకుని వెనకాల ఆ బ్యాక్‌తో ఉంటావ్.. నువ్ నడుస్తుంటే ముందు బొజ్జనే వెళ్తుందని అవినాష్‌ను దారుణంగా అరియానా ఏడిపించింది.