బిగ్ బాస్4: ఆయన వల్ల ఏది కాదు.. అవినాష్ పరువుదీసిన అరియానా

Bigg Boss 4 Telugu week 12 ariyana Fun with Avinash

బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ ఎంత ఫన్నీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొదట్లో అవినాష్ కలిపిన పులిహోర ఓ రేంజ్‌లో వర్కవుట్ అయింది. కానీ మధ్యలో అరియానా తన ప్రేమ గురించి చెప్పడంతో ఈ ట్రాక్ ఫ్రెండ్‌షిప్‌ దగ్గరే ఆగిపోయింది. చూసే ప్రేక్షకులు కూడా ఈ ఇద్దరూ ఎంత సరసాలు ఆడుకున్నా కూడా ఫ్రెండ్స్‌గానే చూస్తూ వస్తున్నారు. అయితే ప్రతీ రోజూ ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు అనుకునే మాటలు బాగా వైరల్ అవుతుంటాయి.

Bigg Boss 4 Telugu week 12 ariyana Fun with Avinash

ముసల్దానిలా ఉన్నావ్. ఆ నడక చూడు.. ఆంటీ, ముసలిదాన అంటూ అవినాష్ అరియానాను ఏడిపిస్తుంటాడు. ఫ్యామిలీ ప్యాక్, ఆ బ్యాక్ అంకుల్ అంటూ అరియానా అవినాష్‌ను ఏడిపిస్తుంటుంది. టాస్క్ ఉన్నా లేకపోయినా అరియానా మాత్రం అవినాష్‌ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఇక నిన్నటి పంకజ్ కస్తూని బ్రీత్ ఈజీ అనే టాస్క్‌లో అవినాష్‌ను అరియానా ఆడుకుంది. సెటైర్ల మీద సెటైర్లు వేసింది. శ్వాస ఎలా తీసుకోవాలో అందరికీ చూపించాలని అవినాష్‌కు టాస్క్ ఇచ్చాడు.

కానీ అవినాష్‌కు అలాంటివేమీ రావు. ధ్యానం, యోగ వంటివాటిలో అవినాష్‌కు ప్రావీణ్యం లేదు. అయినా సరే ఏదో మ్యానేజ్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఇంటి సభ్యులందరూ కౌంటర్లు వేస్తూ వచ్చారు. తప్పు చెబుతున్నావ్.. నీకే రాదు అంటూ అందరూ సెటైర్లు వేశారు. ఆయన వల్ల ఏది కాదు.. ఏది రాదంటూ అరియానా కూడా అవినాష్ పరువు తీసేసింది. చివరకు మోనాల్ వచ్చి అవినాష్‌కు బదులు ఆ టాస్కును పూర్తి చేసేసింది.