బిగ్ బాస్ షోలో పదకొండో వారం నామినేషన్ ప్రక్రియ పెద్ద రచ్చ జరిగింది. చూస్తుంటే అఖిల్ సోహెల్ ఇద్దరూ కలిసి ముందే నిర్ణయించుకున్నట్టుంది. ఆ ఇద్దరూ కావాలని హారిక, అభిజిత్‌లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ ఇద్దరు ఈ ఇద్దరిని నామినేట్ చేశారు. వీరి మధ్య జరిగిన నామినేషన్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అభిజిత్ అఖిల్ మధ్య జరిగిన వాగ్వాదం దాదాపు పావుగంట ప్రసారం చేశారు. ఎడిటింగ్‌లోనే అంత సేపు మాటల యుద్దాన్ని నడిపారంటే నిజంగా ఇంకెంత సేపు వాగ్వాదం పెట్టుకున్నారో.
ఆ ప్రక్రియలో అఖిల్ కొన్ని మాటలు వదిలేశాడు. బొక్క బోర్లా పడ్డాడు. మళ్లీ అమ్మాయి పేరును తీసుకొచ్చాడు. అది మోనాల్ గురించేనని తెలుసు. కానీ మళ్లీ మోనాల్ కాదన్నట్టుగా కవర్ చేశాయి. నేను ఓ అమ్మాయి గురించి అని అన్నాను కానీ మోనాల్ అని అనలేదు అంటూ బురిడీ కొట్టించాలని చూశాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. మళ్లీ మేక పులిలా వచ్చిందని.. మీ అందరి ముందు ఇలా కెప్టెన్ అయి ఉన్నానని గొప్పలు చెప్పుకొచ్చాడు. అయితే జనాలు మాత్రం అఖిల్‌ను దారుణంగా తిడుతున్నారు.
మటన్ షాపు ముందున్న మేకకు గడ్డి చూపించాడు.. లోపలికి వెళ్లింది.. తరువాత ఏమైంది.. లోపల బాగా ప్రొటిన్ ఫుడ్ తిని పులిలా తిరిగి వచ్చింది అని అఖిల్ ఏదో గొప్పలు చెప్పుకున్నాడు. లోపల నాగార్జునను ఎంతలా వేడుకున్నాడు.. మమ్మీ అంటూ ఎంతలా ఏడ్చాడో అందరూ చూశారు. కానీ బయటకు వచ్చాక మాత్రం పులి అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నాడని నెటిజన్లు పరువుదీస్తున్నారు. మేక పులి కాదు బలి అయితది అని అభిజిత్ అన్న మాటలు నిజమవుతున్నాయి. నెటిజన్ల ట్రోలింగ్‌కు అఖిల్ నిజంగానే బలైవుతున్నాడు.