బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్‌లో ఆడవారి సత్తా ఏంటో చూపించారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదన్నట్టుగా టాస్క్ ఆడారు. ఇన్నాళ్లు టాస్కుల పరంగా తనను నమ్మని అఖిల్‌కు మోనాల్ చావు దెబ్బకొట్టింది. పదకొండో వారంలో కెప్టెన్సీ టాస్క్‌లో మోనాల్ నిలబడింది.. హారికను కెప్టెన్‌ను చేసింది. అసలు టాస్క్ ఏంటంటే..కెప్టెన్ పోటీదారులైన అఖిల్ హారిక అభిజిత్‌లు మిగతా కంటెస్టెంట్ల భుజాలపై కూర్చుని ఉండాలి.
ఎవరు ఎక్కువ సేపు నేల మీదకు దిగకుండా ఇతర కంటెస్టెంట్ల భుజాలపై ఉంటారో వారే కెప్టెన్ అవుతారని తెలిపాడు. అభిజిత్ అవినాష్ భుజాల మీదు, అఖిల్ సోహెల్ భుజాల మీద కూర్చున్నారు. ఇక హారికను మోనాల్ తన భుజాల మీద మోసింది. ఇంట్లో లేడీ కెప్టెన్ ఉండాలనే ఉద్దేశ్యంతో మోనాల్ గట్టిగా ప్రయత్నించింది. చివరి వరకు నిలబడింది. హారికను ఇంటి కెప్టెన్‌గా చేసింది.
హారిక కెప్టెన్ అవ్వడంతో ఇంట్లో ఉన్న ఆడవాళ్లు సంబరపడిపోయారు. హారిక, లాస్య, అరియానా, మోనాల్ ఇలా అందరూ గాల్లో తేలిపోయారు. ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరి, మరీ ముఖ్యంగా అఖిల్‌కు తన సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశ్యాన్ని మోనాల్ పూర్తి చేసింది. ప్రతీ టాస్క్‌లో మోనాల్‌ను కించపరిచేలా మాట్లాడే అఖిల్‌కు మోనాల్ కోలుకోలేని దెబ్బ కొట్టి.. కెప్టెన్ కాకుండా అడ్డుపడింది.. హారికను కెప్టెన్ చేసింది.