బిగ్ బాస్ షోలో లీకులు అన్నది సర్వసాధారణమే. ఎలిమినేషన్ జరిగేది ఆదివారమే అయినా ఆ విషయం మాత్రం శనివారమే బయటకు వస్తుంది. ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌ను కూడా శనివారమే షూట్ చేయడమే అందుకు కారణం. దీంతో ఎలిమినేషన్‌లో ఉండాల్సిన మజా కాస్త మిస్ అవుతుంది. కానీ సోషల్ మీడియాలో కావాల్సినంత స్టఫ్ దొరుకుతోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్, లీకులపై నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతుంటారు.
తాజాగా పదకొండో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది లీకైపోయింది. పదకొండో వారంలో అభిజిత్ సోహెల్‌తో పాటు ఇంట్లో ఉన్న అమ్మాయిలంతా నామినేషన్‌లోకి వచ్చారు. అందులో అరియానా హారికలు సేఫ్ పోజిషన్‌లో ఉన్నారని ముందునుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే చివరకు అదే నిజమైంది. ఆ ఇద్దరూ సేవ్ అయ్యారు. చివరకు మోనాల్ లాస్య మధ్య ఎలిమినేషన్ ఉంటుందని విశ్లేషణలు వెలువడ్డాయి.
చివరకు అదేనిజమైంది. లాస్య ఎలిమినేట్ అయినట్టు లీకులు ఊపందుకున్నాయి. అయితే కొందరు మాత్రం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ వారికి ఇది షాక్ ఇచ్చే వార్తే. మోనాల్ సేవ్ అయి లాస్య ఎలిమినేట్ అవ్వడానికి చాలానే కారణాలున్నాయి. ఆమె ఏనాడూ టాస్కులు ఆడింది లేదు. వంటగదిలో దోశలు వేసుకుంటూ పప్పు వండుకుంటూ ఉండటం తప్పా ఏం చేయలేదు. దీంతో ప్రేక్షకులు ఆమెను బయటకు పంపించేశారని తెలుస్తోంది.