బిగ్ బాస్4: అరియానాకు గట్టిగా ఇచ్చింది… వెళ్లేముందు కూడా వదిలిపెట్టని లాస్య!!

Bigg Boss 4 Telugu week 11 Lasya About ariyana

బిగ్ బాస్ షోలో పదకొండు వారాలు సక్సెస్ ఫుల్‌గా గడిచియి. లాస్య ఎలిమినేషన్‌తో ఇంట్లో ఇప్పుడు ఏడుగురు సభ్యులే ఉన్నారు. అయితే లాస్య వెళ్లేటప్పుడు టాప్ 2లో ఎవరుంటారో కూడా అంచనా వేసి చెప్పింది. అయితే మళ్లీ చివరకు హారిక గురించి మాట్లాడుతూ.. టాప్ 3లో ఉండాలి.. టాప్ 2లో ఉండాలి.. టాప్ 1 అవ్వాలి అని కోరుకుంది. అమ్మాయి టైటిల్ గెలిస్తే చూడాలనివుందని తన మనసులోని కోరికను బయటపెట్టేసింది. అమ్మాయి టైటిల్ కొట్టాలని ఆశపడుతుంది లాస్య. కానీ అరియానా అంటే మాత్రం పీకల దాక కోపాన్ని పెట్టుకుంది.

Bigg Boss 4 Telugu week 11 Lasya About ariyana
Bigg Boss 4 Telugu week 11 Lasya About ariyana

మొదటి నుంచి లాస్య అరియానా మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. హిట్ మాన్ టాస్కులో పరిగెత్తుకుంటూ వెళ్లాలి. ఆ డెన్‌లోకి ఎవరు ముందు వెళ్తే వాళ్లకే నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. అలా అరియానా స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లి డెన్‌లోకి చొచ్చుకుపోయింది. ఆ సమయంలో అరియానాకు చిన్నగా దెబ్బకూడా తగిలింది. అప్పుడు అరియానా లాస్యను నామినేట్ చేసింది. ఆ వారం నుంచి అరియానా లాస్యమధ్య వార్ జరుగుతూనే వచ్చింది. నా కోసం అంత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి దెబ్బలు తగిలించుకుని నామినేట్ చేశావా? అని ఆ సమయంలోనే అరియానాకు లాస్య కౌంటర్ వేసింది.

మళ్లీ అదే కౌంటర్ నిన్న ఎలిమినేట్ అయ్యాక కూడా వేసింది. నా కోసం అంత కష్టపడి నామినేట్ చేసేందుకు దెబ్బలు కూడా తగిలించుకుంది.. అందుకే అరియానా ఇష్టమని సెటైర్ వేసింది. అరియానా బోల్డ్‌గానే మాట్లాడుతుంది. తనకు తోచింది మాట్లాడుతుంది. అయితే అది అన్ని సార్లు నిజం కాకపోవచ్చు. అయితే నిజం కానప్పుడు ఆ తప్పును కూడా అంగీకరించని అరియానాకు లాస్య సూచించింది.