బిగ్ బాస్ షోలో అభిజిత్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది.. ఎలా ప్రవర్తిస్తాడు.. ఎలాంటి మాటలు మాట్లాడతాడు అనే విషయాలు అందరికీ తెలిసింది. బిగ్ బాస్ షోలో ఆట అంటే కేవలం ఫిజికల్ టాస్కులు కాదని అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో మనిషి ఎలా ఉంటాడు.. పరిస్థితులను బట్టి ఎలా మాట్లాడతాడు ఎలా ప్రవర్తిస్తాడు అన్నది పరీక్షించడమే బిగ్ బాస్. అందులో ఫిజికల్ టాస్కులు ఆడటం ఒక లాభం వంటిది. అందుకు ఫిజికల్ టాస్కుల్లో వీక్‌గా ఉన్నా మిగతా అన్ని విషయాల్లో అభిజిత్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
బయట ట్రెండ్ కూడా అభిజిత్‌కు అనుకూలంగానే ఉంది. ఇప్పుడు అభిజిత్ ఫ్యాన్స్, ఫాలోవర్ల హవానే నడుస్తోంది. ఈ వారంలో ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ షోలోకి వచ్చారు. దాదాపు ప్రతీ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ కూడా అభిజిత్ అంటే ఇష్టమని, ఫ్యాన్ అని ఏదో ఒకటి చెబుతూ వచ్చారు. అరియానా ఫ్రెండ్ వినీత్ అయితే మీకు పెద్ద ఫ్యాన్ అని అభిజిత్‌తో చెప్పడంతో అరియానా మొహం మాడిపోయినట్టు కనిపించింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లోనూ అంతే.
ముఖ్యంగా అఖిల్ సోదరుడు అభిజిత్ గురంచి మాట్లాడటం.. అందులోనూ గారు అని సంబోధించడంతోనే అభిజిత్ రేంజ్ ఏంటన్నది అర్థమైపోతుంది. మీకు నేను ఫ్యాన్‌ను అని అభిజిత్‌తో అఖిల్ బ్రదర్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ టాప్ 5 ప్లేస్‌లో మొదటి స్థానంలో సోహెల్‌ను పెట్టాడు. రెండో స్థానంలో అఖిల్‌ను పెట్టాడు. మూడో స్థానంలో అభిజిత్‌ను పెట్టాడు. అయితే మామూలుగా టాప్ ప్లేస్‌లో పెడితే.. తన తమ్ముడు అఖిల్ ఫీలవుతాడని అనుకున్నాడో ఏమో గానీ మూడో స్థానంలో అభిజిత్‌ను పెట్టేశాడు. మొత్తానికి అఖిల్ సోదరుడు చెప్పిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.