బిగ్ బాస్ నాల్గో సీజన్ దారుణంగా బెడిసికొట్టింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనే అది తెలిసిపోయింది. టాస్కులు పెట్టడంలో అది మరింత స్పష్టంగా తెలిసిపోయింది. ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాయి. బిగ్ బాస్ ఎంతగా ట్రై చేస్తోన్న టీఆర్పీ మాత్రం రెండంకెలు చేరడం లేదు. అప్పుడప్పుడు వీకెండ్ షోలు మాత్రం పది దాటుతున్నట్టు కనిపిస్తున్నాయి.
కానీ ఓవరాల్‌గా టీఆర్పీ చూస్తుంటే.. ఓ యావరేజ్ బిలో యావరేజ్ సినిమాకు వస్తోన్నంత కూడా రావడం లేదు. మరీ ముఖ్యంగా ఈ వారం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం చేయాలో బిగ్ బాస్‌కు కూడా పాలుపోనట్టుంది. ఈ వారం అసలు సరైన టాస్కులే లేవు. గిఫ్ట్స్, ఉత్తరాలు అంటూ ఏదో కానిచ్చేస్తున్నాడు. నవ్వు నిషేధం అంటూ ఏదో పనికి మాలిన ఆట ఆడించాడు. సీక్రెట్ రూంలో ఉన్న అఖిల్ వల్ల గేమ్ ఏదైనా మారుతుందేమో అని అనుకుంటుంటే అదీ తుస్సుమనేలా ఉంది.
మొత్తానికి ఈ వారంలో ఒకే ఒక్క కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. అది కూడా డిజాస్టర్ అయింది. బాల్, బాస్కెట్ అంటూ ఏదో చేయబోయారు అది రివర్స్ అయింది. ఇక అప్పటి నుంచి టాస్క్‌లు పెట్టనేలేదు. ఉత్తరాల కోసం సీక్రెట్లు చెప్పడం, దీపావళి గిఫ్ట్స్ కోసం నవ్వకుండా ఉండటం అనే టాస్కులు పెట్టి ప్రేక్షకులకు టార్చర్ చూపించాడు. మొత్తానికి ఈ వారం మాత్రం గడిచేలా చేశాడు. పాపం బిగ్ బాస్ గాడి తప్పిన షోను ఎలా నిలబెట్టాలో తలపట్టుకుని ఉన్నట్టున్నాడు.