బిగ్ బాస్ ఇంట్లో అభిజిత్ అఖిల్ మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. ఎంత దగ్గరవుదామని ఈ ఇద్దరూ ప్రయత్నించినా పరిస్థితులు మత్రం అనుకూలించవు. మొదట్లో బాగానే ఉన్నారు. మధ్యలో రా, అరేయ్, ఒరేయ్ అని అఖిల్ సంబోధించాడని అభిజిత్ హర్ట్ అయ్యాడు. ఆ తరువాత అభిజిత్ తన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడని అఖిల్ బాధపడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ వస్తూనే ఉన్నాయి.
ఇక చివరకు మోనాల్ వల్ల ఇద్దరూ బద్ద శత్రువులే అన్న ఫీలింగ్ వచ్చేసింది. అలాగే ఓ ఐదారు వారాలు ఈ ఇద్దరూ మాట్లాడుకోనే లేదు. అఖిల్ మొత్తానికి దూరంగా ఉండేవాడు. అభిజిత్ మాట వరకు పలకరించినా అఖిల్ పట్టించుకోలేదు. అయితే ఎనిమిది తొమ్మిదో వారాల్లో అఖిల్ అభిజిత్ స్నేహితుల్లానే మారాను. కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం, మాట్లాడుకోవడం, టాస్కుల్లో సాయం చేసుకోవడం వంటివి చేశారు.
అంతా బాగుందనే సమయానికి అఖిల్‌ను సీక్రెట్ రూంకి పంపించారు. అందులో అభిజిత్ హారిక లాస్యలు తన గురించి మాట్లాడుకున్న మాటలు విన్నాడు. ఇక ఇంట్లోకి వచ్చిన అఖిల్ ఆ ముగ్గురిని ఏకిపాడేశాడు. మరీ ముఖ్యంగా అభిజిత్‌ను దారుణంగా అవమానించాడు. నీ బుద్ది కింద పడిపోయిందంటూ సెటైర్ వేశాడు. కొంచెం ఆలోచించు. నన్ను ఫేక్ అన్నావ్.. పచ్చకామెర్లోడికే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది.. నువ్ ఫేక్ కాబట్టే నేను నీకు ఫేక్‌లా కనిపిస్తున్నాను అని నిలబెట్టి మరీ పరువుదీశాడు.