బిగ్ బాస్ షోలో ఏదైనా కాలుక్యులేటెడ్‌గా, కరెక్ట్‌గా మాట్లాడేవాడు ఉన్నాడా అంటే అభిజితే. అయితే అతను కూడా కొన్నిసార్లు మాటలు జారుతాడు.. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు కానీ ఒక్కోసారి ఫైర్ బయటకు వస్తుంది. ఆధిపత్యం చెలాయించాలని చూస్తాడు. కానీ ఒకవేళ తప్పు చేస్తే వెంటనే క్షమించమని అడుగుతాడు. పరిస్థితులను చూసి రియాక్ట్ అవుతాడు. ఇంట్లో కూల్ అండ్ స్మార్ట్‌గా ఆడుతూ కొన్ని అంచనాలు వేస్తాడు.
అభిజిత్ కొందరి గురించి కొన్ని చెప్తాడు. అవి ఎంతో నిజంగా అనిపిస్తాయి. ఎదుటి వారి మాటలు వినరు.. మీకు నచ్చితే ఒకలా.. నచ్చకపోతే ఒకలా వ్యవహరిస్తారు అని అమ్మ రాజశేఖర్‌ను మొహం మీదే చెప్పేశాడు. నీది నీకే క్లారిటీ లేదు.. అంటూ మోనాల్‌కు చెప్పాడు. తాజాగా నామినేషన్ ప్రక్రియలో అరియానాకు కూడా గట్టిగా ఇచ్చిపడేశాడు. అభిజిత్ అరియానాను నామినేషన్ చేస్తూ కొన్ని విషయాలను చెప్పాడు.
నువ్ ఒక్కదానివే టాస్క్ ఆడుతున్నట్టు ఎక్కువ చేయద్దు.. టాస్క్ఆడే విధానం కూడా ఉంటుంది.. అది కూడా కాస్త జాగ్రత్తగా చూసుకో.. నువ్ ఇంత చేయమంటే అంత చేస్తావ్ అంటూ అరియానాను అభిజిత్ ఏకిపారేశాడు. టాస్క్ అంటే గేమ్‌లోనే కాదు.. ఇంట్లో ఉండే ప్రతీక్షణం గేమ్ కూడా అని కౌంటర్ ఇచ్చాడు. అభిజిత్‌కు దగ్గరవ్వాలని ఆ మధ్య అరియానా ప్రయత్నించింది కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మొత్తంగా దూరమయ్యారు.