బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం టైటిల్ విన్నర్ ఎవరని అంటే అందరూ అభిజిత్ పేరే చెబుతారు. ఫిజికల్ టాస్కులు సరిగ్గా ఆడకపోయినా కూడా స్మార్ట్‌నెస్‌తో నెట్టుకొస్తున్నాడు. కండబలానికి బదులు బుద్దిబలాన్ని వాడుతూ వచ్చాడు. కొన్ని సార్లు అది సక్సెస్ అయింది.. ఇంకొన్ని సార్లు అది సక్సెస్ కాలేదు. కానీ అభిజిత్‌కు మాత్రం రావాల్సిన క్రేజ్ ఫేమ్ రెండూ వచ్చేశాయి. అయితే అభిజిత్‌కి కూడా కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి.
ఫిజికల్ టాస్కుల్లో ఆడకపోవడం అభిజిత్ మొదటి నెగెటివ్ పాయింట్. భుజానికి ఉన్న గాయం వల్ల ఎక్కువగా ఫిజిలక్ టాస్కులు ఆడటం లేదు. అది పక్కన పెడితే. అభిజిత్ ఎక్కువగా మిగతా కంటెస్టెంట్ల గురించి బ్యాక్ బిచింగ్ లాంటివి చేస్తుంటారు. ఎదుటి వారు మాట్లాడిందే వినాలి అంటాడు. తాను మాట్లాడితే ఒకలా.. మిగతా వారు మాట్లాడితే ఒకలా ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్‌లో అభిజిత్ అఖిల్ టాపిక్‌పైనే ఎక్కువగా చర్చించాడు.
అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ ఇంటి నుంచి బయటకు తోలేశారు. అలా అఖిల్ సీక్రెట్ రూంలోకి వచ్చి పడ్డాడు.
అఖిల్ సీక్రెట్ రూం నుంచి అభిజిత్ మాటలు వింటూ సెటైర్లు వేశాడు. అఖిల్ ఎదురుతిరగాల్సింది.. అలా ఎలా వెళ్లిపోతాడు. తన గురించి తాను మాట్లాడుకోవాలి కదా. కెప్టెన్సీ విషయంలోనూ ఆ ముగ్గురు అలానే చేశారు.. ఎవ్వరికీ కాకుండా పోయిందని ఎప్పుడూ వారి గురించే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇలా అభిజిత్ బ్యాక్ బిచ్చింగ్ చేయడంతో చేస్తుండటంపై అఖిల్ సెటైర్లు వేశాడు. ఈయన ఏ పని చేయడు.. ఇంకొకర్ని చేయనివ్వడు అంటూ సీక్రెట్ రూం నుంచి అందర్నీ గమనించాడు. బయటకు వచ్చాక ఈ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగేలా కనిపిస్తోంది. అభిజిత్ ఇలా మాట్లాడటం కాస్త తగ్గించుకుంటే కచ్చితంగా విజేతగా నిలిచే అవకాశముందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.