బిగ్ బాస్ షోలో అభిజిత్ ఎక్కువగా నోరు మెదపడు. అవసరం అయితే తప్పా ఎక్కువగా మాట్లాడడు. మిగతా కంటెస్టెంట్ల మాదిరి ఓవర్ ఎగ్జైట్మెంట్ చూపించడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిబ్బరంగా ఉంటాడు. అలాంటి అభిజిత్ గురించి, అతని విషయాల గురించి ఇంత వరకు ప్రేక్షకులకు తెలీదు. అభిజిత్ ఏనాడూ తన ఫ్యామిలీ గురించి చెప్పుకోలేదు. తన కుటుంబ విషయాలు కూడా పంచుకోలేదు. నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం అభిజిత్ తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి చెప్పాడు.
నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరికీ ఉత్తరాలు వచ్చాయి. కంటెస్టెంట్లకు వారి వారి ఫ్యామిలీల నుంచి సందేశాలు వచ్చాయి. ఆ లెటర్స్‌ను కంటెస్టెంట్లు సొంతం చేసుకోవాలంటే ఎవ్వరికీ తెలియని సీక్రెట్లను చెప్పాల్సి ఉంటుందన్నాడు. ఆ సీక్రెట్‌తో సంతృప్తి చెందితే అఖిల్ సీక్రెట్ రూం నుంచి ఆ లెటర్స్‌ను సదరు కంటెస్టెంట్‌కు పంపుతాడన్న మాట. అలా టాస్క్ సరిగ్గా ఆడితే అఖిల్‌కు వచ్చిన లెటర్‌ను బిగ్ బాస్ ఇస్తాడు.
అలా ఉత్తరాన్ని చేజిక్కించుకునేందుకు అభిజిత్ తనకు జరిగిన చేదు ఘటనను చెప్పాడు. ఫస్ట్ టైం ఫారెన్‌కు వెళ్లాను. అక్కడ ఏదో బార్‌ను చూశాను. చుట్టూ అంతా గమనిస్తున్నాను.. అక్కడ అందరూ ఏదో తాగుతున్నారని ఆర్డర్ ఇచ్చాను. ఇంతలో ఒకతను వచ్చి ఆ డ్రింక్ నేను తాగొచ్చా? అని అడిగాడు. సరే తీసుకోండి అని చెప్పాను. మాటలు కలిపాడు. నేను ఇక్కడే ఉంటాను.. మీరు మరి అని అడిగాడు. నేను విజిట్ చేయడానికి వచ్చాను అని చెప్పాను. నంబర్ ఇవ్వమని అడిగాడు. సర్లే అని ఇచ్చాను. ఆ తరువాత దగ్గరకు వచ్చి చేతులు వేయబోయాడు. ఏంటి ఇది అని అడిగాను. మీకు తెలియదా? ఇది గే బార్ అని అవతలి వ్యక్తి అసలు విషయం చెప్పాడు. ఈ విషయాన్ని తాను ఇంత వరకు ఎవ్వరితోనూ షేర్ చేసుకోలేదని అభిజిత్ తన రహస్యాన్ని బయటపెట్టాడు.