అదిరిపోయిన ప్లాన్.. శ్రీముఖి, అభిజిత్‌లతో ఇక రచ్చే

Sreemukhi Abhijeet As Hosts In BB Utsavam

ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఒకే చోటకు చేరుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఉత్సవం పేరిట జరగుతున్న ఈవెంట్‌లో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. ఈమేరకు షూటింగ్ కూడా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అయితే అలా షూటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో కంటెస్టెంట్లు సెల్ఫీలు, వీడియోలు షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ముందుగా ఇందులో మూడు సీజన్ల కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారని అనుకున్నారు.

Sreemukhi Abhijeet As Hosts In BB Utsavam
Sreemukhi Abhijeet As Hosts In BB Utsavam

మొదటి రెండు రోజులు నాల్గో సీజన్ కంటెస్టెంట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం మూడు సీజన్ల ఇంటి సభ్యులు మాత్రం రీయూనియన్ ప్రోగ్రాం పెట్టుకున్నారేమోనని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఉత్సవం అనే ఈవెంట్ కోసం ఇలా అందరూ ఒకే చోటకు చేరుకున్నారట. అందుకు ఇలా గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు అందరూ రెడీ అయ్యారు. ఇందులో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లే హోస్ట్‌లుగా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

దీనిలో భాగంగా బిగ్ బాస్ ఉత్సవాన్ని శ్రీముఖి, అభిజిత్ కలిసి ముందుకు తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రోమోను వదిలారు. స్టేజ్ మీద శ్రీముఖి, అభిజిత్ కలిసి హోస్ట్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్రసారం చేయబోతోన్నట్టు ప్రకటించారు. మొత్తానికి స్టార్ మా మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ల మామూలుగా వాడటం లేదు. అటు కామెడీ స్టార్, స్టార్ట్స్ మ్యూజిక్ వంటి షోల్లో వాడేశాడు. ఆఖరికి డ్యాన్స్ ప్లస్ షోలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు.