Home News అభిజీత్‌, హారికల మ‌ధ్య రిలేష‌న్ ఏంటి.. ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన దేత్త‌డి

అభిజీత్‌, హారికల మ‌ధ్య రిలేష‌న్ ఏంటి.. ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన దేత్త‌డి

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్రమం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో జూన్ లేదా జూలైలో ఐదో సీజ‌న్ జ‌రుపుకోనుంది. అయితే కరోనా టైంలో సీజ‌న్ 4 జ‌రుగుతుందా లేదా అని అంద‌రు డైల‌మాలో ఉన్న స‌మ‌యంలో నిర్వాహ‌కులు ప‌లు జాగ్ర‌త్త‌ల న‌డుమ ఈ కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. హౌజ్‌మేట్స్ అంద‌రిని క్వారంటైన్‌లో ఉంచి ఆ త‌ర్వాత షోకు తీసుకొచ్చారు.

Abi Hari | Telugu Rajyam

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం కూడా మంచి ఆస‌క్తిని రేకెత్తించింది. కొట్లాట‌లు, అల్ల‌ర్లు, రొమాంటిక్ ముచ్చ‌ట్లు ఇలా ఒక‌టేంటి హౌజ్‌లో చాలానే న‌డిచాయి. అయితే సీజ‌న్ 4 విన్న‌ర్ అయిన అభిజీత్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రికి పులిహోర క‌లుపుతూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. ముందుగా మోనాల్‌తో కాస్త క్లోజ్‌గా మూవ్ కాగా, అది బెడిసి కొట్ట‌డంతో స్వాతి దీక్షిత్ చెంత చేరాడు.ఆమె వారానికే వెళ్లిపోవ‌డంతో హారిక‌ని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంట‌నేది తెలియ‌క అంద‌రు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

హౌజ్‌లో ఉన్న‌ప్పుడు చాలా క్లోజ్‌గా ఉన్న అభిజీత్‌, హారిక‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాక ప‌లు విష‌యాల గురించి మాట్లాడారు. హారిక త‌న‌కు చెల్లెలు లాంటిది అని అభిజీత్ ప‌లు మార్లు చెప్ప‌గా, హారిక ఇంత వ‌ర‌కు ఓపెన్ కాలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మా ఇద్ద‌రిది ఒక ఆర్గానిక్ ఫ్రెండ్షిప్‌. బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ రిలేష‌న్‌ని హౌజ్‌లోను మెయింటైన్ చేశాం. కాని అది చూపించ‌లేదు. అందువ‌ల‌న మా ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ బ‌య‌ట వేరేలా ప్రొజెక్ట్ అయింది. ప్ర‌స్తుతం నాకు ప‌లు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. వాటితో బిజీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది హారిక‌. 

- Advertisement -

Related Posts

దేవినేని అవినాష్‌కు పెద్ద బాధ్యతే అప్పజెప్పిన సీఎం జగన్… నిరూపించుకుంటే ఇక దశ మారినట్టే ?

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ...

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా...

‘దృశ్యం 2’ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్ !

గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త...

Latest News