బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ఫైనల్స్ కి చేరువలో ఉంది. ఎప్పటికప్పుడు హౌజ్ లో కొత్త రంగులతో దర్శనమిస్తున్న కంటెస్టెంట్స్ పోటాపోటీగా పోరాడుతున్నారు. వారం మొత్తం కష్టపడిన వారు ఎలిమినేషన్ తుది దశలో అనవసరంగా బలవుతున్నారనే కామెంట్స్ గతంలో చాలానే వచ్చాయి. ఇక ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హౌజ్ లో ప్రతి ఒక్కరు బలంగానే ఉన్నారు.
ఎవరు కూడా నమ్మకం కోల్పోవడం లేదు. ఇక ప్రతిసారి ఎలిమినేషన్ ట్విస్టు ఒకరోజు ముందే లీక్ అవ్వడం కామన్ గా మారింది. ఎంత సీక్రెట్ గా ఉంచినప్పటికి చాలా ఈజీగా తెలిసిపోతోంది. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న అవినాష్, మోనాల్ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లిపోతారని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మోనాల్ గజ్జర్ నెవర్ బిఫోర్ అనేలా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో షోలో సరికొత్త వాతావరణం క్రియేట్ చేసింది.
మోనాల్ తన కన్నీళ్లతో స్వమ్మింగ్ ఫుల్ ని కూడా నింపగలదని ఒక ట్యాగ్ కూడా అందుకుంది. గ్లామర్ విషయంలో ఇక స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరో కంటెస్టెంట్స్ అవినాష్ ఇన్ని రోజులు హౌజ్ లో అందరిని నవ్విస్తూనే ఆటలో భాగంగా వెన్నుపోట్లు బాగానే పొడిచాడు. ఎలాగైనా గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ వారం అతను సేవ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం అవినాష్ వెళ్లిపోవడం ఖాయమని టాక్. అతను ఎలిమినేట్ అయితే మాత్రం షోలో కామెడీ చేసేవాళ్లే ఉండరని అందరికి తెలిసిందే. మరి బిగ్ బాస్ ఎలాంటి మలుపులు తిరుగుతోందో చూడాలి.