బిగ్ బాస్ టైటిల్ విన్నర్.. చెప్పకనే చెప్పేసిన మోనాల్

Bigg Boss 4 Telugu Monal about Title winner

బిగ్ బాస్ నాల్గో సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆటతో సంబంధం లేకుండా.. టైటిల్ విన్నర్‌ ఎవరన్నది ఓ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. బిగ్ బాస్ టైటిల్‌కు అభిజిత్ అర్హుడంటూ.. అతనే విజేతగా నిలుస్తాడంటూ నెటిజన్లు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తూ వచ్చారు. ఇక ఫినాలే వీక్ రావడం విన్నర్ కోసం ఓట్లు వేస్తుండటంతో అభిజిత్ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్లకు బయట జరుగుతున్న ట్రెండ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్‌ల గురించి ఎవ్వరికీ తెలీదు. అలా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన మోనాల్ అభిజిత్ ఫాలోయింగ్ చూసి మైండ్ బ్లాక్ అయినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారని మోనాల్‌ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే అదిరిపోయే సమాధానం చెప్పింది. కానీ అందులో అభిజిత్ పేరు బయటకు ప్రత్యక్షంగా చెప్పడానికి మాత్రం అంతగా అంగీకరించ లేదు.

Bigg Boss 4 Telugu Monal about Title winner

తనకు మాత్రం అఖిల్ విజేతగా నిలవాలని ఉంది.. లేదా సోహెల్ విన్నర్ అవ్వాలని ఉందంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. కానీ పరిస్థితి చూస్తుంటే వేరే అతను విన్నర్ అయ్యేలా ఉన్నారంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. అతను ఎవరు పేరు చెప్పండని అడిగితే మాత్రం చెప్పలేదు. అఖిలే విన్నర్ అవ్వాలని మోనాల్ కోరుకుంది. మోనాల్ చెప్పనంత మాత్రాన ఆ పేరు ఎవ్వరికీ తెలియకుండా పోదు.. మోనాల్ కోరుకున్నంత మాత్రాన అఖిల్ విన్నర్ అవ్వలేడు.