Home Entertainment నాగార్జున అలా చేయడం బాధగా అనిపించింది.. అఖిల్ తల్లి కామెంట్స్

నాగార్జున అలా చేయడం బాధగా అనిపించింది.. అఖిల్ తల్లి కామెంట్స్

బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్‌లో ఎన్నో రకాల మూమెంట్స్ జరిగాయి. కొన్ని వింతలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొన్ని రికార్డులు హిస్టరీలో నిలిపోతాయి. అలా బిగ్ బాస్ నాల్గో సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో టాప్ 3లోకి ఒక్క అమ్మాయి కూడా రాకపోవడం ఓ వింతే. అరియానా టాప్ 3లో ఉంటుందని అంతా భావించారు. కానీ అది నిజం కాలేదు. నాల్గో స్థానానికే పరిమితమైంది. మెహబూబ్ అందించిన హింట్‌తో సోహెల్ బాగా లాభపడ్డాడు.

Bigg Boss 4 Telugu Finale Episode Akhil Mother About Nagarjuna
Bigg Boss 4 Telugu Finale episode Akhil Mother ABout Nagarjuna

బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ డబ్బులు తీసుకుని గేమ్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్‌గా సోహెల్ రికార్డులు క్రియేట్ చేశాడు. అలా సోహెల్ బయటకు రావడంతో అఖిల్ అభిజిత్ టాప్‌2లోకి వచ్చారు. ఇక్కడ టాప్ 2లో విన్నర్‌ను ప్రకటించే విధానం అందరికీ తెలిసిందే. నాగార్జున ఇద్దరి చేతులను పట్టుకుని పైకి లేపి.. టెన్షన్ క్రియేట్ చేస్తూ… కాసేపు అందరినీ ఆందోళనకు గురి చేస్తాడు. చివరకు ఒకరి చేతిని వదిలిపెట్టి.. మిగిలిన ఒకరి చేతిని పైకి ఎత్తుతాడు.

అయితే ఈ సారి కూడా అలాగే చేశాడు నాగ్. కాకపోతే అఖిల్ చేతిని వదిలిపెట్టకుండా విసిరిపడేశాడు. ఆ ఘటన తనను బాగా బాధపెట్టిందని అఖిల్ తల్లి దుర్గ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎపిసోడ్ మొత్తాన్ని చాలా చక్కగా నడిపించారు. విజేతను ప్రకటించే సమయంలో అఖిల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నారు. కానీ ఒక్కసారిగా అఖిల్ చేతిని కిందికి విదిలించడంతో నాకు చాలా బాధ కలిగింది. అంటూ తన బాధను చెప్పుకొచ్చింది. అలా చేతిని విదిలించడంపైనా అఖిల్‌ను బాగానే ట్రోల్ చేశారు.

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News