బిగ్‌బాస్ హౌస్‌లో రెండో వారం కాస్త వినోదాన్ని పంచేలానే కనిపిస్తోంది. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. పడవ ప్రయాణంలో తీరం చేరిన ప్రతీసారి మోగిన గంటకు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు. అలా గంగవ్వ, నోయల్, మోనాల్, సోహెల్, అభిజీత్, హారిక, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, కరాటే కళ్యాణి ఇలా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు.

Bigg Boss 4 Telugu Devi Nagavalli COmments On Amma Rajasekhar
ఇక నేడు హౌస్‌లో ఫుల్ రొమాన్స్ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో హారిక బుల్లి స్కర్ట్‌తో దుమ్ములేపింది. హారిక వేసే హాట్ స్టెప్పులతో హౌస్ మేట్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా షాక్ అవుతారేమో. అయితే దేవీ నాగవల్లి దారుణమైన ఓ మాట అనేసింది. అది టాస్క్‌లో భాగంగా అన్నదా? లేదా మనసులో మాటా? అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ దేవీ నాగవల్లి అన్న మాట ఏంటో చూద్దాం.

Bigg Boss 4 Telugu Devi Nagavalli COmments On Amma Rajasekhar
బిగ్ బాస్ ఏదో పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.దేవీ నాగవల్లి ఊరమ్మాయి క్యారెక్టర్ వేసినట్టు కనిపిస్తోంది. ఇక ఆమె మాట్లాడుతూ.. పేపర్ మీద అమ్మాయి పేరు కనిపించినా కూడా వదలడని అని అమ్మ రాజశేఖర్‌ను అన్నట్టు తెలుస్తోంది. మరి ఈ మాటలు నిజంగానే మాస్టర్‌ను ఉద్దేశించే అందా? టాస్క్‌లో భాగంగా అందా? అసలు సంగతి ఏంటి? అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.