బిగ్ బాస్ తాజా సీజన్ మంచి రేటింగ్‌తో దూసుకెళ్తుంది. మంచి కంటెస్టెంట్లను పంపివేస్తున్నారంటూనే..వీక్షకులు షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. సోమవారం నామినేషన్ ఎపిసోడ్‌లో హౌస్ మొత్తం సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఎప్పుడూ సెలెంట్‌గా ఉండే హారిక లాంటి కంటెస్టెంట్లు కూడా మాటలతో రెచ్చిపోయారు. ఈసారి నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ ఎక్కువమందికి టార్గెట్ అయ్యాడు. అయితే ఎంతమంది నామినేట్ చేసినా అభిజిత్ గ్రాఫ్ పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. “మేక పులి అవ్వదు..బలి అవుతుంది” అని అఖిల్‌ను ఉద్దేశించి అభి అన్న డైలాగ్ ఓ స్టార్ హీరో టీజర్ మాదిరి సూపర్ క్లిక్ అయ్యింది.
షో ప్రారంభమయ్యి ఇప్పటికే 72 రోజుల గడిచిపోయాయి. ఫ్యామిలీ ఫోటోలు వచ్చినప్పపుడు, ఇంటి నుంచి లెటర్స్ అందినప్పుడు, ఇతర కంటెస్టెంట్స్ మిగలినవారికి గిఫ్ట్స్ పంపినప్పుడు హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. ఆ ఎపిసోడ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. అయితే ఎవరికీ తమ కుటుంబ సభ్యులను కలిసే ఛాన్స్ మాత్రం దక్కలేదు. షో ముగియడానికి రోజులు దగ్గర పడుతోన్న సమయంలో ఆ ముచ్చట తీర్చడానికి బిగ్ బాస్ సన్నాహాలు మొదలుపెట్టాడట. ఎన్నో కష్టనష్టాకోర్చి హౌస్‌లో ఉంటోన్న వాళ్లకి తమవాళ్లని చూసే భాగ్యం కల్పించబోతున్నట్లు తెలిసింది. ఆ ఎపిసోడ్‌కు నేడే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం అందింది. ఇదే కనక నిజమైతే నేటి ఎపిసోడ్ ఫుల్ ఎమోషన్ మోడ్‌లో సాగే అవకాశం ఉంది.
ఇప్పటికే తగదాలతో, విబేధాలతో తీవ్రంగా కృంగిపోయిన కంటెస్టెంట్లకు ఇది బూస్టప్ ఇచ్చే విషయం అని చెప్పాలి. మరి నిజంగా నేటి ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా? సర్ప్‌ర్రైజ్ ఇస్తారా? అన్నది తెలియనుంది. అయితే టాస్కులు పెట్టి అందులో గెలిచినవారికే ఆప్తులను కలిసే ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఓడిపోయిన కంటెస్టెంట్ల బాధ వర్ణణాతీతం అని చెప్పాలి. ఇక తాజాగా అందుతోన్న సమాచారాన్ని బట్టి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆ సమయం దాటిపోయిందని, ఈ కోవిడ్ సమయంలో అంత రిస్క్ చేయదలుచుకోలేదని బిగ్ బాస్ ఇన్ సైడ్ వర్గాలు వెల్లడించాయి.